Breaking News

రాష్ట్రంలో మహిళల అభివృద్ధి సంక్షేమం కోసం చర్యలు తీసుకుంటున్నాం

-మహిళల సమస్యలు ఇప్ప టివరకు  670 కేసుల్లో 400  కే సులు పరిష్కరించాం.
-రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి మహిళకు పోషకాహారాన్ని అందించడంతో పాటు అవగాహన కల్పించాలని ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభు త్వం ఒక బృహత్తర కార్యక్రమానికి తీసుకురావడం జరిగిందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్,గజ్జల వెంకట లక్ష్మి పేర్కొన్నారు. గురువారం ఆర్ అండ్ బి అతిధి గృహంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళల అభివృద్ధి సంక్షేమం కోసం చర్యలు తీసు కుంటున్నామన్నారు.

ప్రతి మహిళకు పోషకాహారాన్ని అం దించడంతో పాటు అవగాహన కల్పి స్తున్నామన్నారు. వరసగా 7 వ ఏడా ది పోషణ మా కార్యక్రమాన్ని నిర్వ హించుకుంటున్నామన్నారు. ప్రతి ఏడాది పోషణ్ “మా “ద్వారా గర్భ వతులకు, బాలింతలకు, యుక్త వయసు బాలికలకు పోషకాహాన్ని అందించడంతోపాటు, సీమంతాలను కూడా జాతీయ మహిళా కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగు తొందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది కర్నూలు జిల్లాలో బాలింత లకు గర్భిణీలకు యుక్త వయసు బాలికలకు అవగాహన కార్యక్రమా లు నిర్వహించామన్నారు. అదే విధం గా కడప జిల్లాలో మహిళలకు సం బంధించి వైద్య పరీక్షలు నిర్వహిం చడంతోపాటు పరిశరాలు పరిశు భ్రత, గ్రీనరీపై అవగాహన తో పాటు తగు సూచనలు ఇవ్వడం జరిగిం దన్నారు. జాతీయ మహిళా కమిషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర మహిళా కమి షన్ సూచనల మేరకు ఉమెన్ ప్రెజ న్స్ లో హెర్బల్ ప్లాంటేషన్ ఏర్పాటు కు చర్యలు చేపట్టడం జరుగుతోంద న్నారు.

ముఖ్యంగా కడప, నెల్లూరు, రాజమ హేంద్రవరం జైల్స్ ను పరిశీలించామ ని అక్కడ పోషణ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతొందన్నారు. మహిళా ఖైదీలకు వారి రైట్స్ ప్రకారం ప్రభుత్వం వారికి అందిస్తున్న సేవలు అందుతున్నది లేనిది పరిశీలించమ న్నారు. ఈరోజు రాజమండ్రి జైల్లో కూడా పోషణ మా కార్యక్రమాన్ని ని ర్వహించడం జరిగిందన్నారు. ఇక్కడ వున్న మహిళా ఖైదీలు పరివార్తన చెందేలా వారు చేసిన తప్పులు సరి దిద్దుకోనెలా వారి జీవన విధానంలో మార్పులు రావాలని కౌన్సిలింగ్ ఇ వ్వడం జరుగుతుందన్నారు. వారి ఆరోగ్య రీత్యా వివిధ విభాలకు చెం దిన వైద్యులను రప్పించి వారికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అం దించడం జరిగిందన్నారు. అదేవిధం గా వారికి సంబంధించి టాయిలెట్స్, లైబ్రరీ లను పరిశీలించామన్నారు. జైల్లో శిక్షలు అనుభవిస్తున్న మహిళా ఖైదీలకు పోషక విలువలతో కూడిన ఆహారం అందించే దిశగా పోషణ్ మా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నమ న్నారు. జైలు వాతావరణాన్ని వారు పరివర్తన చెంది ఆధ్యాత్మిక క్షేత్రంగా వారి ఆశ్రమాన్ని కల్పించే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయని పేర్కొన్నారు.

మహిళల సమస్యలు ఇప్పటి వరకు  670 కేసుల్లో 400  కేసులు పరిష్క రించడం జరిగిందన్నారు. మహిళా లైంగిక వేధింపులకు గురి చేస్తే  వారి పై చట్టపరంగా  కఠిన చర్యలు చేప డతామని తెలిపారు. డ్రగ్స్ మద్యా న్ని అరికడితే మహిళలపై అత్యాచా రాలు జరగవు అని తెలిపారు.  మ హిళలపై అత్యాచారాలు జరగకుం డా అరికట్టేందుకు  కట్టగట్టుమైన చర్యలు తీసుకుంటున్నామని తెలి పారు.  గర్భవతులకు, బాలింతలకు, యుక్త వయసున్న మహిళలకు పోష కాహార విలువల  గురించి వివరించ డం జరుగుతోందని అన్నారు.

మహిళలు, పిల్లలపై జరిగే అత్యా చారాలు, మానసిక వత్తిడి పెంచడం వంటి కేసులు ప్రతినెల 60 నుంచి 80 వరకు ఉంటుంనాయన్నారు. జూన్, జులై మాసం లో అయితే 90 కేసులు కుడా నమోదు అయ్యాయన్నారు. ముఖ్యంగా ఫోక్సో కేసులు నమోద య్యాయని, వాటిని సోషల్ మీడి యాలో కాని టి.వి చానల్స్ లో గాని చూసిన వెంటనే సుమోటా గా స్వీక రించి ఎస్పీలకు సిఫార్స్ చేయడం జరుగుతుందన్నారు. కుటుంబాలలో మహిళలు వరకట్నం వేధింపులకు ఎలా గురవుతున్నారో, మహిళా ఉద్యోగులు కూడా వారు పని చేసే ప్రదేశాల్లో అంతే ఇబ్బందులు ఎదు ర్కొంటున్నారన్నారు. వీరందరినీ దృష్టిలో మహిళా కమిషన్ రాబోయే రోజుల్లో యాక్టు చర్యలు చేపట్టనున్నదన్నారు.

ఉపాధ్యాయులు సన్యాసి రావు పై చర్యలకు డిమాండ్:

ఈ రోజు నగరానికి వివిధ కార్యక్రమాలకోసం వచ్చిన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి కి గార్డ్స్ ఫర్ ఆర్ టి ఐ ప్రతినిదులు వరదా నాగేశ్వర రావు సమక్షంలో శాటిలైట్ సిటీ ఏ బ్లాక్ లో ప్రభుత్వ పాఠశాలలో టీచర్ గా పని చేస్తున్న సన్యాసిరావు అనే ఉపాధ్యాయుడు పిల్లలపై జరిగిన లైంగిక వేధింపుల కేసు విషయమై చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. బొమ్మూరు పోలీస్ స్టేషన్లో పోక్సో చట్ట ప్రకారం ఎఫ్ ఐ ఆర్ రిజిస్టర్ చేశారని కానీ ముద్దాయిని ఇంతవరకు అరెస్ట్ చేయలేదని వివరించారు. ఈ కార్యక్రమంలో గార్డ్స్ మహిళా కన్వీనర్ శ్రీమతి ఆకుల విజయ భారతి, ముద్దలా అను, కృష్ణ చైతన్య, ముత్యాల పోసికుమార్, వనచర్ల సుజాత తదితరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ పిడి, కే విజయ కుమారి, సెంట్రల్ జైలు సూపరింటెం డెంట్ డిఎస్పి, వసంతకుమారి,  ఉమెన్స్ కమిషన్ లీగల్ కౌన్సిలిస్ట్, ఏ పూజిత, పిఎస్ ఉమెన్స్ కమిషన్, వి.నాగమణి
సూపరింటెండెంట్, పి మాధవీలత,  వైద్యులు పి. శిరీష, కే ఝాన్సీ పద్మ, ఎన్ అన్నపూర్ణ,  సిడిపివోలు సిహెచ్ వి నరసమ్మ,  ఎం నాగమణి తదితరులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *