విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వరద ముంపుకు గురైన మోటార్ వాహనాలను రిపేర్లు చేసి త్వరగా బాధితులకు అందజేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని రవాణా శాఖ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా తెలియజేసారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ లోని రవాణా కార్యాలయం నుండి శుక్రవారం నాడు ఒక పత్రిక ప్రకటనను విడుదల చేశారు ఈ సందర్భంగా రవాణాశాఖ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా మాట్లాడుతూ వరద ముంపుకు గురైన వాహనాలు సంబంధించి ఇన్సూరెన్స్ క్లెయిమ్ లను త్వరగా ఇప్పించే ప్రక్రియను చేపట్టాలని అలాగే వాహనాలను త్వరగా రిపేర్లు చేయించి బాధితులకు అందజేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఇన్సూరెన్స్ కంపెనీలతో సమావేశంలను ఏర్పాటు చేసి, వాళ్ళతో మాట్లాడి సుమారు 4836 పాలసీదారులకు 1730.19 లక్షలను అందేవిధంగా చేశామన్నారు. ఇంకను 6236 పాలసీదారులకు ఇవ్వవలసి ఉందన్నారు. వరదల్లో చిక్కుకున్న టువంటి వాహనాల రిపేర్లు చేయునిమిత్తం 65 సర్వీసింగ్ సెంటర్ల ద్వారా లోకల్ మెకానిక్ ల ద్వారా 5000 వాహనాలను పైబడి రిపేర్లు చేయించడం జరిగిందని అన్నారు. వాహనాలు త్వరగా రిపేర్లు చేయించి వాహన యజమానులకు అందించే దానిలో రవాణాశాఖ పనిచేస్తుందన్నారు. ఇతర జిల్లాల నుంచి కూడా 67 మంది మోటర్ వాహన తనిఖీ అధికారులను విజయవాడకు రప్పించడం జరిగిందని, వాహనాలను రిపేర్లు చేయించి వాహన యజమానులకు అందించాలని ఉద్దేశంతో ప్రతి ఐదు సర్వీసింగ్ స్టేషనులకు ఒక యం వి ఇన్స్పెక్టర్ చొప్పున కేటాయించి రిపేర్లు చేపిస్తున్నామని తెలియజేసారు.రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వరద చిక్కుకున్న బాధితులను సురక్షిత ప్రాంతాలకు చేరవేసే దానిలో 7820 వాహనాలను ఏర్పాటుచేయడం జరిగిందన్నారు.
Tags vijayawada
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …