విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేవదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో వేదవిద్య లో ఉత్తీర్ణత పొంది నిరుద్యోగులుగా ఉన్నవారికి నిరుద్యోగ భ్రుతి క్రింద నెల ఒక్కింటికి రూ.3,000/- పొందేందుకు ఆసక్తి గల నిరుద్యోగ వేద పండితుల నుండి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా దేవాదాయ శాఖ అధికారి కె.సుపద్నాదేవి ఒక ప్రకటనలో తెలిపారు. వేద విద్య లో క్రమాంతం ఆపై కోర్సులు అభ్యసించి ఉత్తీర్ణత పొందిన నిరుద్యోగులు, నిరుద్యోగ భ్రుతిని పొందేందుకు దరఖాస్తు తో పాటు వేద విద్య సర్టిఫికెట్లనఖలు, ఆధార్ నఖలు మరియు, ఎటువంటి ఉద్యోగం చేయటం లేదని స్వీయ వాంగ్ముల దృవపత్రం దరఖాస్తు తో జతచేసి జిల్లా దేవదాయ శాఖ అధికారి, దేవదాయ ధర్మదాయ శాఖ, విజయవాడ వారి కార్యాలయము నందు ఈనెల26వతేదీ సాయంత్రం గం.5.00 ల లోగా సమర్పించాలని జిల్లా దేవాదాయ శాఖ అధికారి కె.సుపద్నాదేవి ఆ ప్రకటనలో తెలిపారు. ఇతర వివరాలకు 0866-2572004 ల్యాండ్ లైన్ నెంబర్ ను సంప్రదించవచ్చునని తెలిపారు.
Tags vijayawada
Check Also
అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం
-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …
Prajavartha Online Telugu News