Breaking News

పర్యాటకుల స్వర్గధామం ఆంధ్రప్రదేశ్

-భవిష్యత్ అంతా పర్యాటకానిదే
-పర్యాటకం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలి
-పర్యాటకం పై సోషల్ మీడియా లో విరివిగా ప్రమోషన్ లు చేయాలి
-టూరిజం సర్క్యూట్ లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి
-సెప్టెంబర్ 27న వరల్డ్ టూరిజం డే ని పెద్ద ఎత్తున నిర్వహించాలి
-ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఏపీ టీడీసీ) అధికారులతో సమీక్ష సమావేశంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భవిష్యత్ అంతా పర్యాటకానిదే అని, పర్యాటక అభివృద్ధిపై ఏపీటీడీసీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ సూచించారు. శుక్రవారం ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని ఆటోనగర్ లో ఉన్న ఏపీ టీడీసీ( ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ) కార్యాలయంలో మంత్రి కందుల దుర్గేష్ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పర్యాటక అభివృద్ధి కోసం భవిష్యత్ ప్రణాళికలపై అధికారులను అడిగి సమాచారం తెలుసుకున్నారు. శాఖాపరమైన సమస్యలపై ఆరా తీశారు. ప్రతి వారం సమీక్షా సమావేశం నిర్వహిస్తానని తెలిపారు. అధికారులంతా ఐకమత్యంతో పని చేసి పర్యాటక సంస్థ అభివృద్ధికి పాటుపడాలన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పర్యాటకుల స్వర్గ ధామమన్నారు. రాష్ట్ర పర్యాటకంపై సోషల్ మీడియా ద్వారా విరివిగా ప్రమోషన్ లు చేయాలని అధికారులకు సూచించారు. క్షేత్ర స్థాయి పరిశీలనకు వెళ్ళాలి అని ఆదేశించారు. పర్యాటక ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలపై దృష్టిసారించి త్వరతగతిన పరిష్కరించాలని చెప్పారు..ఎకో టూరిజం, అడ్వెంచర్ టూరిజం, టెంపుల్ టూరిజం, అగ్రి టూరిజం పై దృష్టిసారించాలన్నారు. ప్రముఖ సంస్థలతో మాట్లాడి పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించాలన్నారు. పర్యాటక ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన పై శ్రద్ధ వహించాలన్నారు..ఎఫ్ డీసీతో సమన్వయం చేసుకొని థియేటర్ లలో పర్యాటకం పై లఘు చిత్రాలు ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. అంతిమంగా పర్యాటకులకు ఇబ్బంది కలగకుండా వసతులు కల్పించాల్సిన బాధ్యత తమదే అని గుర్తుంచుకోవాలన్నారు. టూరిజం సర్క్యూట్ లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, పర్యాటకులు 2,3 రోజులు టూరిజం స్పాట్ లో గడిపేలా వసతులు ఉండాలన్నారు.. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నిడదవోలు నియోజకవర్గంలో పర్యాటక ప్రాంతానికి అవసరమైన అన్ని వనరులు ఉన్నాయని, స్థానికంగా ఉన్న కెనాల్ అభివృద్ధికి చర్యలు తీసుకొని బోటింగ్, రిసార్ట్ లు ఏర్పాటు చేసి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలన్నారు..

అదేవిధంగా త్వరలోనే సినీ నిర్మాతలతో సమావేశం నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటానని మంత్రి అన్నారు. ఇక పర్యాటక ఉత్సవాలైన విశాఖ, భీమిలి ఉత్సవ్, ఫ్లెమింగ్ ఫెస్టివల్, అరకు బెలూన్ ఫెస్టివల్, నాగాయలంక బోట్ రేస్, గండికోట ఫెస్టివల్, ఎఫ్ 1హెచ్ 20 ఫార్ములా రేస్, కాకినాడ బీచ్ ఫెస్టివల్, నేచురల్ హెరిటేజ్ ఫెస్టివల్, లేపాక్షి ఫెస్టివల్ తదితరుల ఉత్సవాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని అధికారులు కోరగా అందుకు సరే అన్నారు.. ఈ సందర్భంగా నెలల వారీగా టూరిజం శాఖ ద్వారా నిర్వహించాల్సిన ఫెస్టివల్ ల లిస్ట్ ను మంత్రికి చూపించి వివరించారు.

సమీక్షా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఏపీ టీడీసీ) ఎగ్జి క్యూటివ్ ఎడిటర్ ఎ.ఎ.ఎల్. పద్మావతి, ఓఎస్డి, జనరల్ మేనేజర్లు, సీఈ లు, ఎస్ ఈ లు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *