మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర గనులు, భూగర్భవనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర శనివారం స్థానిక 50వ డివిజన్ డ్రైవర్స్ కాలనీలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న దొడ్డాకుల యేసు వరప్రసాద్ కుమారుడు శ్యామ్ సంతోష్ 12 సం. బాలుని అతని ఇంటి వద్ద మంత్రి పరామర్శించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి లేదా ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా బాలునికి మెరుగైన వైద్య సహాయం అందించుటకు కృషి చేస్తామన్నారు. మాజీ మున్సిపల్ చైర్మన్ బాబా ప్రసాద్, స్థానిక నాయకులు ఇలియాస్ పాషా, రాజా, దుర్గారావు, తాసిల్దారు శ్రీనివాస్ తదితరులు మంత్రి వెంట ఉన్నారు.
Tags machilipatnam
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …