Breaking News

బుడమేరు వరద మృతుని కుటుంబానికి 5 లక్షల చెక్కు అందించిన మంత్రి కొల్లు రవీంద్ర

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర గనులు, భూగర్భవనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఇటీవల ప్రమాదవశాత్తు బుడమేరు వరదలో కొట్టుకుపోయి మరణించిన బందరు మండలం హుస్సేన్ పాలెం గ్రామానికి చెందిన మృతుడు కలిదిండి ఫణి కృష్ణ కుటుంబానికి వరదసాయంగా రూ. 5 లక్షల చెక్కును శనివారం మంత్రి మృతుని ఇంటి వద్ద అతని భార్య జ్యోతికి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మృతుని కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యంగా ఉండాలని వారిలో ఆత్మస్థైర్యం నింపారు. మృతునికి ఇద్దరు ఆడపిల్లలు కాగా, పిల్లల చదువులకు ఏ సహాయం కావాలన్నా ప్రభుత్వపరంగా అందిస్తామని హామీ ఇచ్చారు. బాగా చదువుకుని వృద్దిలోకి రావాలని పిల్లలను దీవించారు. మాజీ మున్సిపల్ చైర్మన్ బాబా ప్రసాద్, స్థానిక నాయకులు కుంచే దుర్గాప్రసాద్, తాసిల్దారు శ్రీనివాస్ తదితరులు మంత్రి వెంట ఉన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *