-స్వచ్ఛభారత్ మిషన్ పై వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శనివారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ వారు స్వచ్ఛ భారత్ మిషన్ పై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ జాయింట్ సెక్రెటరీ ఈ సమావేశంలో మిలియన్ ప్లస్ నగరాలు, రాష్ట్ర రాజధానులు త్రాగునీటి సరఫరా, సిహెచ్ ట్రీట్మెంట్, ఘన వ్యర్థ నిర్వహణ తదితర అంశాలపై బడ్జెట్లో చేయవలసిన కేటాయింపు గురించి వివరించారు. సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంటలను ఆధునికరించటం, ప్రజలందరికీ నాణ్యమైన త్రాగునీటి సరఫరా అందించడం, ఘన వ్యర్థ పదార్థాల సేకరణ మరియు నిర్వహణ మెరుగుపరచటం లాంటి విషయాలపై అధునాతన విధానాలను అనుసరించడం వాటిపై ఈ సమావేశంలో వివరించారు. సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ద్వారా శుద్ధి అయి వచ్చిన నీటిని వ్యవసాయానికి ఉపయోగించటం, స్వచ్ఛ భారత్ మిషన్ పై ప్రజలకు అవగాహన కల్పించడమే కాకుండా వారిని భాగస్వాములు చేస్తూ ఇటువంటి కార్యక్రమాలలో వారిని పాల్గొని చేసేలా చూడాలని ఈ కార్యక్రమంలో వివరించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తో పాటు అడిషనల్ కమిషనర్ (ప్రాజెక్ట్స్) కె.వి సత్యవతి, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పి రత్నవళి, ఎస్ ఈ (ప్రాజెక్ట్ )రామ్మోహన్రావు, ఎస్ ఈ (వర్క్స్) శ్రీరామచంద్రమూర్తి పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News