-ప్రజా సంక్షేమం మరియు అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం…. ఇది మంచి ప్రభుత్వం…. ప్రజలు మెచ్చిన ప్రభుత్వం… అభివృద్ధే నా నినాదం: చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఇది మంచి ప్రభుత్వం… ప్రజా ప్రభుత్వం అని, ప్రజా సంక్షేమం మరియు అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని…. ఇది మంచి ప్రభుత్వం…. ప్రజలు మెచ్చిన ప్రభుత్వం అని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి అయిన సందర్భంగా ప్రభుత్వం పలు హామీలను అమలు చేసిందని ఇది మంచి ప్రభుత్వం అనే నినాదంతో ప్రజల ముంగిటకు ప్రజావేదిక నిర్వహించి ముఖ్యమంత్రి ఇచ్చిన స్పూర్తి, ఆదేశాల మేరకు ప్రజలతో మమేకమై కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నామని తిరుపతి జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ మరియు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సంయుక్తంగా పేర్కొన్నారు.
శనివారం ఉదయం తిరుపతి రూరల్ మండలం ఉమ్మడి మంగళం సచివాలయం -2 నందు ఇది మంచి ప్రభుత్వం అనే బృహత్తర కార్యక్రమం ప్రజావేదికను చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్థి నాని, జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ మరియు సంబంధిత అధికారులతో, ప్రజా ప్రతినిధులతో కలిసి నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌ. ముఖ్యమంత్రి గారు అధికారులకు చెబుతూ ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని, ప్రజలకు అభివృద్ధి సంక్షేమం అనేవి రెండు సమాంతరంగా అందాలని, వాటి కొరకు కలెక్టర్లు, అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారితో మమేకమై వారి సమస్యల పరిష్కారానికి సానుకూల దృక్పథంతో ఉండాలని సూచించారని అన్నారు. దేశంలో ఎక్కడ కూడా ఇంత పెద్ద మొత్తంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్లను పలు కేటగిరీల కింద పేదలకు ప్రతి నెల ఒకటో తేదీన ఉదయాన్నే సచివాలయ సిబ్బంది ద్వారా అందించడం జరుగుతోందని, మన జిల్లాలో ఒకటో తేదీననే సుమారు 96 శాతం పైన పంపిణీ చేయడం జరుగుతోంది అని, ఈ నెల ఒకటో తేదీన ఇవ్వాల్సిన పింఛన్లను ఆదివారం ఉందని ఒక రోజు ముందుగానే ఆగస్ట్ 31 ననే అందించి గొప్ప మనసు కలిగిన నిజమైన ప్రజా పాలకుడిగా ఆదర్శంగా మన ముఖ్యమంత్రి నిలిచారని అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే పలు హామీలు ముఖ్యమంత్రి నెరవేర్చారని అన్నారు. తొలి సంతకం నిరుద్యోగులకు మెగా డిఎస్సీ పై సంతకం చేశారని అన్నారు. మన జిల్లాలో శ్రీసిటీ నందు పలు పరిశ్రమలకు శంఖు స్థాపన, ప్రారంభోత్సవాలు ఈ మధ్యనే చేయడం జరిగిందని తెలిపారు. మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు స్థానిక సంస్థలను బలోపేతం చేయడం కొరకు పంచాయితీలకు నిధులు కేటాయించి బలోపేతం చేశారని, రాష్ట్రం మొత్తం మీద ఒకే రోజున అన్ని చోట్ల గ్రామ సభలు నిర్వహించి గ్రామ అభివృద్ది విజన్ డాక్యుమెంట్ తయారు చేసిన ఘనత అని, అలాగే మన జిల్లాలో శ్రీహరికోట ను సందర్శించారని తెలిపారు. అలాగే మంత్రి నారా లోకేష్ విద్యా వ్యవస్థ పటిష్టం చేయుటకు అనేక చర్యలు చేపడుతున్నారని అన్నారు. తిరుపతి పర్యటనలో మంత్రి లోకేష్ తనకు పాఠశాలలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం, బోధన ఎలా అమలు అవుతుందని పరిశీలించాలని సూచించారని, అదే విధంగా తాను, అధికారులు పాఠశాలలను తనిఖీ చేసి బడి భోజన పథకం అమలును, విద్యా బోధన విధానాన్ని పరిశీలించి పాఠశాలలు చక్కగా పని చేసేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. చంద్రగిరి ప్రాంతంలో కూడా పలు పరిశ్రమలు రానున్నాయని తెలిపారు. తక్కువ ధరకు పేదలకు మంచి నాణ్యమైన ఆహారం అందించడం అన్నా క్యాంటీన్ ల పునరుద్ధరణ ద్వారా చేట్టిన ఒక గొప్ప కార్యక్రమం అని తెలిపారు. హై వేస్ చూస్తే నాయుడు పేటకు వెళ్ళాలంటే గతంలో ప్రయాణం ఎంతో నరక ప్రాయంగా చాలా సమయంలో కూడి ఉండేదని, పలు ఆక్సిడెంట్లు కూడా జరిగేవని, ముఖ్యమంత్రి గారు ప్రాధాన్యత గా సదరు రోడ్డు పనులు త్వరిత గతిన చేపట్టాలని ఆదేశించారని, పనులు శర వేగంగా జరుగుతున్నాయని వచ్చే నవంబర్ 15 నాటికి రోడ్డు పని పూర్తి ఐతుందని తెలిపారు. రేణిగుంట, ఏర్పేడు, శ్రీకాళహస్తి రోడ్ పనులు పూర్తి అయ్యాయని అన్నారు. అలాగే ఎమ్మెల్యే గారు తెలిపిన మల్లవరం నుండి చెన్నై రోడ్ కలిపే ఆరు వరుసల హై వే రోడ్డు పనులు త్వరలోనే ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. డ్వాక్రా సంఘాలను 30 సం.ల కిందటే ఏర్పాటు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి దే అని ఆంటు. లక్ పతి దిది అనే కార్యక్రమం దేశ ప్రధాని నిర్వహించిన కార్యక్రమం లక్ష్యం ప్రతి మహిళను లక్షాధికారి చేయాలని అని, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని లక్షాధికారులు కావాలని అన్నారు. మన పొదుపు సంఘాలు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాయని అన్నారు. ప్రస్తుతం స్వచ్చత హి సేవ కార్యక్రమం జిల్లా అంతటా జరుగుతోందని, ప్రతి ఒక్కరూ పాల్గొని, వారు వారి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని కోరారు. టిడ్కో ఇళ్ళ ఏర్పాటుకు సంబంధించి సర్వే డిపార్ట్మెంట్ కు కేటాయించిన స్థలాన్ని పరిశీలించి తదుపరి చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ప్రజలు సమస్యలు ఉంటే పీజీఆర్ఎస్ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పాకాల గార్మంట్ ఫ్యాక్టరీ కి సంబంధించి కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మన రాష్ట్ర ప్రభుత్వం చేసిన పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సచివాలయం ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు ప్రజల ముంగిటకు ఇంటింటికి వెళ్లి వివరించాలని, ఇది మంచి ప్రభుత్వం అని అన్నారు. 100 రోజుల్లోనే ఇన్ని మంచి పనులు చేసిన ప్రభుత్వం, మరి ఇంకా ఎంతో సమయం ఉంది కాబట్టి మరెన్నో మంచి కార్యక్రమాలు చేసే అవకాశం ఉంది అని తెలిపారు. టైలరింగ్ శిక్షణ ఇచ్చి కుట్టుమిషన్ లు ఇస్తామని తెలిపారు.
సంక్షోభంలోనూ సంక్షేమం అందించి, అభివృద్ధికి రెక్కలు తొడిగి, 100 రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలచేత అనిపించుకుంటోంది కూటమి ప్రభుత్వం.
చంద్రగిరి ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇది మంచి ప్రభుత్వం. ప్రజలు అందరు వారు మెచ్చి, వారి మనసులోని మాటే పలు చోట్ల ప్రజలందరూ చెబుతున్న మాట ఇది మంచి ప్రభుత్వం అని అన్నారు. ముఖ్యమంత్రి పలు హామీలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేయడం ప్రారంభించి అండగా నిలుస్తున్నారని, మెగా డిఎస్సీ విడుదల చేయడం, ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్లులను క్లియర్ చేశారని, ధాన్యం కొనుగోలు పెండింగ్ బిల్లులు విడుదల చేశారని, భవిషత్తుకు భరోసా ఇచ్చేందుకు అనేక చర్యలు చేపట్టడం జరిగిందనీ అన్నారు. నకిలీ మద్యం కాకుండా బ్రాండెడ్ మద్యం అక్టోబర్ నుండి అమలులోకి వస్తున్నాయని అన్నారు. తెలుగు గంగ నీరు ప్రతి ఇంటికి అందేలా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆమోదంతో జల జీవన్ మిషన్ కింద మంజూరుతో చర్యలు చేపడుతున్నామని అన్నారు. నిరుద్యోగ యువతకు మెగా డిఎస్సీ విడుదల చేయడం, ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పెంపు, అన్నా క్యాంటీన్ ల పునరుద్ధరణ, ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దు, ఒకటో తేదీననే ఉద్యోగులకు జీతాలు ఇస్తున్న ప్రభుత్వం అని, గత ప్రభుత్వ ధాన్యం కొనుగోలు బకాయిలు చెల్లించి అన్నదాతను ఆదుకోవడం జరిగిందనీ, స్థానిక సంస్థలకు రాష్ట్రంలోని పంచాయితీలకు రూ.1452 కోట్లు జమ చేసి గ్రామ పరిపాలన పంచాయితీ వ్యవస్థకు ప్రాణం పోసారని అన్నారు. విజయవాడ నగరం వరదలతో అతలాకుతలం అయి ప్రజలు విలవిల లాడుతున్న సందర్భంలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 10 రోజులు నిద్రాహారాలు మాని బస్సు లో ఉండి ప్రజలను ఒక తండ్రిలా కాపాడుకున్నారు అని అన్నారు. కళాశాలల విద్యార్థులకు డొక్కా సీతమ్మ బడి భోజన పథకం అమలుకు నారా లోకేష్ గారు చర్యలు చేపడుతున్నారని అన్నారు. చంద్రగిరి నందు ఐటి పరిశ్రమ అభివృద్ధి జరిగేలా చర్యలు తీసుకుంటామని ఐటి మంత్రి హామీ ఇచ్చారని, పలు పరిశ్రమలు మన చంద్రగిరి నియోజకవర్గానికి వస్తున్నాయని అన్నారు. ఆరోగ్య భీమా అందరికీ అందేలా చర్యలు చేపట్టారని అన్నారు. మంగళం ఉమ్మడి పంచాయితీ నందు కుట్టు మిషన్ పై శిక్షణ ఇచ్చి వారికి కుట్టు మిషన్లు అందించే విధంగా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. మన ముఖ్యమంత్రి కేంద్రంలో సత్సంబంధాలు కలిగి మన రాష్ట్ర అభివృద్ధి పరుగులు తీయించెలా నిధులు వచ్చేలా, పనులు పరుగులు తీసేలా పలు చర్యలు తీసుకుంటున్నారని, తన స్వంత పనులకు కాకుండా ప్రజల ప్రయోజనాల కొరకు మాత్రమే తాను కేంద్రంలో ప్రధాన మంత్రి, పలు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. వేంకటేశ్వర స్వామి పాదాల చెంత ఉన్న మన తిరుపతి జిల్లాలోని ప్రజల మనోభావాలు దెబ్బతినేలా గత ప్రభుత్వంలోని పలువురు తిరుమల అంశంలో అనేక అవకతవకలకు పాల్పడినారని వాటిపై ముఖ్యమంత్రి తప్పక చర్యలు తీసుకుంటారని తెలిపారు. అన్నా క్యాంటీన్ ను ఆర్టీఓ కార్యాలయం వద్ద త్వరలో అందుబాటులోకి తెస్తామని తెలిపారు. టిడ్కో ఇళ్ళ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను ఎమ్మెల్యే కోరారు. అభివృద్ధే తన నినాదం అని అన్నారు.
పలువురు ప్రజలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చాలా మంచి అభివృద్ధి సంక్షేమం అందిస్తున్నారని ఇది మంచి ప్రభుత్వం అని కొనియాడారు.
అనంతరం కలెక్టర్, ఎమ్మెల్యే అధికారులు, ప్రజా ప్రతినిధులు కలిసి పలు గృహాలను సందర్శించి ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలను సచివాలయం సిబ్బంది వివరించి వారి గృహాలకు ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్ లను అతికించి కరపత్రాలను పంచి పెట్టారు. అలాగే ఎమ్మెల్యే తో కలిసి టిడ్కో గృహాల నిర్మాణాల కొరకు స్థల పరిశీలన చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయితీ అధికారిణి సుశీల దేవి, ఎంపిడిఓ రమేష్, తిరుపతి అర్బన్, రూరల్ తాసిల్దారులు భాగ్య లక్ష్మి, రామాంజనేయులు తదితర అధికారులు, ప్రజా ప్రతినిధులు, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.