విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వినాయక చవితి ఉత్సవాలు నియోజకవర్గంలో వైభవంగా సాగుతున్నాయి. వివిధ మండపాల్లో విభిన్న రూపాల్లో దర్శినమిచ్చిన గౌరీ పుత్రుడిని దర్శించుకోడానికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. 25వ డివిజన్ దుర్గాగ్రహారంలోని చవితి మండపాన్ని వైసీపీ నగర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సందర్శించి.. ఏకదంతునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ గణనాథుని చల్లని దీవెనలతో ప్రజలందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. మహా గణాధిపతి ఆశీస్సులు నగర ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని.. స్వామి వారి కృపతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కాంక్షించారు. నిమజ్జన సమయంలో తగు జాగ్రత్తలు పాటించాలని భక్తులకు సూచించారు. ఆయన వెంట చల్లా సుధాకర్, కోలంటి రవి, నాగేశ్వరరెడ్డి, ఆకెళ్ల శ్రీను తదితరులు ఉన్నారు.
Prajavartha Online Telugu News