విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 72వ జయంతి వేడుకలు డివిజన్ కో ఆర్డినేటర్ న్యాయవాది ఒగ్గు గవాస్కర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గురువారం 32 వ డివిజన్ అయోధ్య నగర్ ఏరియా నందు డివిజన్ కో ఆర్డినేటర్ న్యాయవాది ఒగ్గు గవాస్కర్ కార్యాలయం లో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వై యెస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా, ఎమ్మెల్యే మల్లాది విష్ణు పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్, చేసి తదనంతరం కరోనా కష్టకాలంలో అలుపెరగకుండా కష్టపడిన వైఎస్సార్ సీపీ ముఖ్య కార్యకర్తలకు, పేదలకు, వికలాంగులకు బియ్యం, నిత్యావసర సరుకులు, మిఠాయిలు , పండ్లు కూరగాయలు సుమారుగా 250 మందికి పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ఒగ్గు గవాస్కర్ మాట్లాడుతూ ఇప్పటి పరిస్థితుల్లో కార్యకర్తలు, పేదలు ఇబ్బంది పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని మా చేతనైనంతలో చేసిన సాయమే ఇది అని అన్నారు. పేదల పాలిట పెన్నిధి బడుగు బలహీనవర్గాల పాలిట దేవుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి అని అన్నారు. మహనేత పుట్టిన రోజున రైతు దినోత్సవం జరుపుకోవడం అ మహనీయినికి మనం ఇచ్చే నిజమైన నివాళులని తెలిపారు. మహనేత అశయాలకు అనుగుణంగా నడుస్తున్న యువనేత ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి మనం అందరం సహకరిద్దామన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు, లింగాల శ్రీనివాస్, మెట్టు కాశీరెడ్డి, చింతా పెద్దిరాజు, లాజరు, బాలాజీ, మేకతోటి రవి, వేణు, మురళి, స్వామీ నాయుడు, మహిళా కార్యకర్తలు, నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి
-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …