Breaking News

పేదప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నేత డాక్టర్ వైయస్ఆర్ : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గా సంక్షేమ పథకాలు పరిచయం చేసి పేదప్రజల ఉన్నతికి కృషి చేసిన మహానేత స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి ని, అందుకే నేడు ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా సరే నేటికీ ప్రతి పేదవాడి గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉన్నారని తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ కొనియాడారు. గురువారం రాజశేఖర్ రెడ్డి  72 వ జయంతి సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా వైస్సార్సీపీ నాయకులు ఆయన విగ్రహాలకు పూలమాలలు సమర్పించి పలు సామాజిక సేవ కార్యక్రమంలు చేపట్టగా అవినాష్ ముఖ్య అతిథిగా హాజరై వాటిని ప్రారంభించి ఆ మహనీయునికు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ నాడు ఉమ్మడి రాష్ట్రంలో వైస్సార్  ముఖ్యమంత్రి గా ప్రమాణస్వీకారం చేయగానే పాదయాత్ర లో తాను చూసిన ప్రజల కష్టాలను రూపుమాపేలా అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని, పేదరికం కారణంగా ఏ విద్యార్థి చదువుకు దూరం కాకూడదు అని ఫీజు రెఅంబేర్స్మెంట్ పెట్టి ఉచిత విద్య , ఆరోగ్య శ్రీ, 108 వంటి పధకాల ద్వారా పేదవారికి ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందజేసి వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని తెలిపారు. ఎంతో మంది సామాన్యులను నాయకులు గా తీర్చిదిద్ది వారికి అండగా నిలిచిన నిజమైన నాయకుడు వైస్సార్ అని, నేడు ఆయన తనయుడు గా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  అలాంటి సంక్షేమ పాలన అందజేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. రైతుల మొహంలో సంతోషం చూడాలని, వారికి అండగా ఎన్నో పథకాలు పెట్టిన వైస్సార్ జయంతి ని రైతు దినోత్సవంగా చేసుకోవడం గర్వకారణం అని అన్నారు. వైస్సార్  భౌతికంగా దూరమై దాదాపు 10 సంవత్సరాలు కావొస్తున్న ప్రజల గుండెల్లో ఆయన రూపం నిలిచిపోయింది అని అందుకే టీడీపీ నాయకులు ఓర్వలేక నేటికి ఆయన ను విమర్శిస్తున్నారు అని, మిరెన్ని కుయుక్తులు పన్నిన ప్రజల మనస్సు లో ఆయన స్తానం పదిలం అని, ప్రజలు ఆ నమ్మకం తోనే మరో 30 సంవత్సరాలు జగన్ కే ముఖ్యమంత్రి గా అవకాశం ఇస్తారని తెలిపారు. ప్రక్క రాష్ట్ర నాయకులు కూడా వారి రాజకీయ లబ్ది కోసం వైస్సార్ పేరును కించపరిచే వాఖ్యలు చేయడం మంచి పద్ధతి కాదని, సాక్షాత్తు అసెంబ్లీ వేదికగా మీ ముఖ్యమంత్రి కేసీఆర్ రే రాజశేఖర్ రెడ్డి పెట్టిన పధకాలను కొనియాడారు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. టీడీపీ నాయకులు గాని,ఇతర ప్రతిపక్ష నేత లు గాని ఇంకోసారి సోషల్ మీడియా ఉందని, వైస్సార్  గురుంచి గాని, జగన్  గురించి గాని అవాకులు చవాకులు పేలితే తగు బుద్ధి చెబుతామని గట్టిగా హెచ్చరించారు. వైస్సార్ జయంతి సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా వైస్సార్సీపీ నాయకులు మొక్కలు నాటే కార్యక్రమాన్ని, పలు సామాజిక సేవ కార్యక్రమం చేపట్టడం జరిగిందని ఇంత మంచి కార్యక్రమంలు చేపట్టిన వారందరినీ అభినందించారు. ఈ కార్యక్రమలలో వైస్సార్సీపీ రాష్ట్ర నాయకులు కడియాల బుచ్చిబాబు, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,ఆయా డివిజిన్ల కార్పొరేటర్ లు, ఇన్ ఛార్జ్ లు, వైస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.

Check Also

వరద బాధితులకు విరాళాల వెల్లువ

-సీఎం చంద్రబాబును కలిసి చెక్కులు అందించిన దాతలు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అనూహ్య వరదలతో నిర్వాసితులైన బాధితులకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *