Breaking News

బాలకార్మిక ,భిక్షాటన రహిత తిరుమల గా తీర్చదిద్దుదాం… : రాష్ట్ర బాలల హక్కుల కమిషన్

తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుమలలో బాలకార్మికులు, భిక్షాటన లేకుండా సంబంధిత అధికారులు అందరూ సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఛైర్మన్ కేసలి అప్పారావు, సభ్యులు ట్రిపర్ణ ఆదిలక్ష్మి మరియు బత్తుల పద్మావతి పేర్కొన్నారు. తిరుమలలో ముఖ్యమైన వీధుల్లో దుకాణాల్లో,హోటల్స్ లో బాలకార్మికులను మరియు భిక్షాటన చేస్తూ ఉన్న బాలలను గుర్తించడం వారి ఈ పరిస్థితులకు గల కారణాలపై ఆరా తీయడం జరిగింది. వీరిలో ఎక్కువుగా తమిళనాడు కొంతమంది కర్ణాటక మరియు ఒడిస్సా నుండి వచ్చినట్టు గుర్తించడం జరిగింది. ముఖ్యంగా బాలలతో పూసలు బొమ్మలు మొదలగు ఆట వస్తువులు తల్లిదండ్రుల తో కలిసి అమ్మకాలు చేస్తున్నారని అన్నారు. షాపు యజమానులతో సమావేశమై చర్చించి బాలలను పనిలో పెట్టుకుంటే శాఖాపర చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొంతమంది విద్యను మధ్యలో వదిలివేసి బాలకార్మికులుగా, భిక్షాటన చేసేవాళ్ళను గుర్తుంచి వారికి కౌన్సెలింగ్ చేసి మళ్ళీ తిరిగి పాఠశాలల్లో ,పునరావాస కేంద్రాలు లో ప్రవేశించడానికి కొంతమంది తల్లిదండ్రులు అంగీకరించేలా మాట్లాడారు. చంటిపిల్లల తల్లిదండ్రులతో మాట్లాడి వారికి అందుతున్న సేవలు గురించి ఆరా తీయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా బాలల సంరక్షణ విభాగం అధికారి శివ కుమార్ ,విజిలెన్స్ అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *