విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వరద బాధితులకు ఆర్థిక సహాయానికి సంబంధించి ఖాతాల్లో నగదు జమకాని వారికి నేరుగా సాయం అందించేందుకు గౌరవ ముఖ్యమంత్రి సోమవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తారు అంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. సృజన ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ఇప్పటికే 90 శాతం మేర నగదు జమ చేయడం జరిగిందని.. మిగిలిన వారికి బ్యాంకు ఖాతాలు సరిగా లేనందువలన పెండింగ్లో ఉందని, ఖాతాలు వివరాలు సరిచేసుకున్న వెంటనే వారికి కూడా పరిహారం నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేయడం జరుగుతుందన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలను తప్పుదోవ పట్టించేలా అపోహలు సృష్టించవద్దని స్పష్టం చేశారు.
Prajavartha Online Telugu News