-ఆస్రా అవగాహన సేవలు అభినందనీయం… : డీజీపీ గౌతమ్ సవాంగ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వినియోగదారుల హక్కులపై ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టిన ఆస్రా ప్రతినిధులను డీజీపీ గౌతమ్ సవాంగ్ అభినందించారు. బుధవారం న్యాయవాదుల అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్స్బిలిటీ అండ్ అవేర్ నెస్ (ఆస్రా) కృష్ణ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అమరావతి బోటింగ్ క్లబ్ సిఇఒ తరుణ్ కాకాని, డీజీపీ గౌతమ్ సవాంగ్ కు పుష్పగుచ్చం అందించి ఆస్రా నిర్వహించే కార్యకలాపాలను వివరించారు. సంబంధిత బ్రోచర్లను, కార్యాచరణ బుక్‌లెట్‌ను డీజీపీ గౌతమ్ సవాంగ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా గురువారం ఓ ప్రకటన విడుదల చేసారు. ఈ సందర్భంగా తరుణ్ కాకాని మాట్లాడుతూ ఆస్రా ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా, కర్ణాటక, హర్యానా, ఢిల్లీ, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో పనిచేస్తున్నదన్నారు. వినియోగదారుల హక్కుల గురించి సాధారణ ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించబడతాయన్నారు. న్యాయపరమైన చర్యలను సరళీకృతం చేసేందుకు అవగాహనను విస్తరించడానికి వినియోగదారులకు మద్దతుగా త్వరలో విజయవాడలో మొబైల్ వ్యాన్లు ప్రారంభించనున్నట్లు తరుణ్ కాకాని వివరించారు.వినియోగదారుల హక్కుల గురించి ప్రజల్లో అవగాహన కలిగించే కార్యకలాపాలకు తమ మద్ధతు ఉంటుందని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. ఇందుకు సంబంధించిన కార్యక్రమాల్లో తాము పాల్గొనడానికి డీజీపీ గౌతమ్ సవాంగ్ ను ఆహ్వానించగా ఆయన సమ్మతిని వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎపి రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యుడు మధు కొనేరు, కృష్ణ డిటి ఇసి ప్రకాష్, ఆసరా మహిళా అధ్యక్షురాలు శిరీషా చేకూరి, కరంకౌర్ తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి
-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …