-అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్
-ఆముదార్లంకలో 380 వరద బాధిత కుటుంబాలకు వంట పాత్రలు, కుక్కర్లు పంపిణీ
చల్లపల్లి, నేటి పత్రిక ప్రజావార్త :
వరద బాధితులకు నియోజకవర్గ విద్యా కుటుంబం సహాయం అపూర్వమని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. గురువారం చల్లపల్లి మండలం ఆముదార్లంకలో 380 వరద బాధిత కుటుంబాలకు నియోజకవర్గ విద్యా కుటుంబం ఆధ్వర్యంలో వరద బాధితులకు వంట పాత్రలు, కుక్కర్లు పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల సంభవించిన వరదల సమయంలో నియోజకవర్గంలోని కృష్ణానది లంక, ద్వీప గ్రామాల్లో సర్వస్వం కోల్పోయిన 2,600ల వరద బాధిత కుటుంబాలకు నియోజకవర్గంలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు కలిసి ఇంతటి మహోన్నత కార్యక్రమాన్ని నిర్వహించటం ఆదర్శనీయంగా నిలిచిందన్నారు. రూ.29,78,185లతో నియోజకవర్గ విద్యా కుటుంబం అందించిన సహాయం విద్యా కుటుంబ ఐక్యతకు నిదర్శనంగా నిలిచిందన్నారు. ఈ మహోన్నత సేవాయజ్ఞంలో భాగస్వాములు అయిన ప్రతి ఒక్కరూ నేటి సమాజానికి స్ఫూర్తి ప్రదాతలుగా నిలిచారన్నారు. నియోజకవర్గ విద్యా కుటుంబం చేపట్టిన ఈ మహోన్నత సేవకు రూ.ఐదు లక్షలు అందించిన చల్లపల్లి విజయ అకాడమీ విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆదర్శనీయులన్నారు. ఈ సందర్భంగా విజయ అకాడమీ ఉపాధ్యాయుడు దుర్గాప్రసాదును, వ్యక్తిగతంగా రూ.ఇరవై వేలు విరాళం అందించిన దింటిమెరక హెచ్ఎం ప్రేమ్ సాగర్ లను ఎమ్మెల్యే ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో సర్పంచ్ నడకుదుటి ఆదిలక్ష్మి, సీఐ కే.ఈశ్వరరావు, ఆర్ఐ కృష్ణమోహన్, ఎంఈఓలు టీవీఎం రాందాస్, జీ.ఎన్.బీ.గోపాల్, పీ.వెంకటేశ్వరరావు, వీ.శ్రీనివాసరావు, డెమోక్రటిక్ పీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు జీవీఎస్ పెరుమాళ్ళు, ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వీ.సాంబశివరావు, ఉపాధ్యాయ సంఘం నాయకులు దేవరపల్లి సురేష్, పంచాయతీ కార్యదర్శి, వీఆర్ఓ, సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.