Breaking News

మూడు రోజులు తిరుపతి, తిరుమల పర్యటన ముగించుకొని రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రికి సాదర వీడ్కోలు

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
మూడు రోజులు తిరుపతి,తిరుమల పర్యటన ముగించుకొని తిరిగి గురువారం రాత్రి 8.10 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయితీ రాజ్, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి గౌ : కొణిదెల పవన్ కళ్యాణ్ కు రేణిగుంట విమానాశ్రయం నందు జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, తిరుపతి, శ్రీకాళహస్తి నియోజకవర్గాల శాసన సభ్యులు అరణి శ్రీనివాసులు,బొజ్జల సుధీర్ రెడ్డి, జనసేన పార్టీ నాయకులు తదితరులు సాదర వీడ్కోలు పలికారు. అంతకుముందు తిరుమల నుండి తిరుపతి చేరుకొని తిరుపతి పట్టణం లో నిర్వహించిన వారాహి సభ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించి, అనంతరం రేణిగుంట విమానాశ్రయం చేరుకొని ప్రత్యేక విమానం లో విజయవాడ కు బయలుదేరి వెళ్ళారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *