-ఆన్లైన్ లో 137, ఆఫ్ లైన్ లో 4
-కలెక్టరు పి ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యల పరిష్కారం కోసం క్షేత్ర స్థాయి అధికారులు నిబద్దత కలిగి పరిష్కారం కోసం అవసరమైన చర్యలు తీసుకునేలా ఉండాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు.
సోమవారం కలెక్టరేట్ లో జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు తో కలిసి ప్రజల నుంచి కలెక్టర్ అర్జీలను స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి వివిధ మండలాల నుంచి వివిధ సమస్యల పరిష్కారం కోసం వచ్చిన అర్జీలను స్వీకరించి, సంబంధిత రెవెన్యూ, మండల స్థాయి అధికారులు జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా పరిష్కార స్థాయిపై సమీక్ష చెయ్యడం జరిగింది. ప్రజల సమస్యల విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని, మీ స్థాయి లో పరిష్కారం అయ్యే వాటి మీద ఎందుకు దృష్టి పెట్టడం లేదని పేర్కొన్నారు. రెవిన్యూ, భూముల సర్వే, అంత్యోదయ బియ్యం రేషన్ కార్డు ద్వారా 35 కేజీల బియ్యం సరఫరా, సదరం ధ్రువపత్రాల, సామాజిక భద్రత పెన్షన్ల కోసం అర్జీలు ఇవ్వడం జరిగింది. అదే విధంగా గ్రామ పంచాయతీ పరిధిలో శానిటేషన్, విద్యుత్ సరఫరా, భూ ఆక్రమణ, త్రాగునీరు సరఫరా, మురుగునీరు, టిఫ్ టిడ్కో గృహాలు కేటాయింపు తదితర అంశాలపై అర్జీలను స్వీకరించడం జరిగింది. సంబంధిత శాఖల అధికారులకు ఎండార్స్ చేస్తూ, సూచనలను ఇవ్వడం జరిగింది. రెవిన్యూ 58 , పంచాయతీ రాజ్ 25 , హోమ్ 16, పౌర సరఫరాలు 8 , ఆర్ డబ్ల్యూ ఎస్ 7, ఇతర శాఖలకు చెందినవి 27 ఉన్నాయి.
పీజీఆరెఏస్ లో జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్న రాముడు, జిల్లా రెవెన్యూ అధికారికి జి. నరసింహులు , జిల్లా ప్రణాళిక అధికారి ఎల్. అప్పలకొండ, ఇతర జిల్లా అధికారులు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించడం జరిగింది.