Breaking News

అర్జీలు తిరిగి ప్రారంభం కావడంలో మండల స్థాయి అధికారులు చర్యలు తీసుకోవాలి

-సమస్యను తెలుసుకుని పరిష్కారం దిశగా ఆలోచన చేయాలి
-ప్రభుత్వ కార్యాలయ ఆవరణను పరిశుభ్రంగా ఉంచాలి
-ఉపాధి హామీ పని దినాల లక్ష్యాలను నూరు శాతం సాధించాలి
-జెసి చిన్న రాముడు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రెవెన్యూ అంశాల పరిష్కార విషయంలో సమయపాలన కచ్చితంగా పాటించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు స్పష్టం చేశారు.

సోమవారం సాయంత్రం రెవెన్యూ డివిజనల్ మండల స్థాయి అధికారులతో హౌసింగ్ రెవెన్యూ ఉపాధి హామీ తదితర శాఖల పనితీరుపై జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు తో కలిసిసమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు మాట్లాడుతూ, రెవెన్యూ సంబంధ అంశాలపై నివేదికలు ఎప్పటికప్పుడు అందచేయాలన్నారు. వాటికీ చెందిన నివేదికలు, ప్రాధాన్యతా క్రమంలో చేపట్టి పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతిసారి నివేదికలు విషయంలో అడిగిన సందర్భంలో రేపు పంపుతామని చెప్పడం పై జెసి ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయపాలన పాటించడం పై ఎందుకు దృష్టి పెట్టడం లేదనీ ప్రశ్నించారు. సిఎం , మంత్రుల ద్వారా సిఫార్సు చేసిన అర్జీలు పరిష్కార స్థితిపై తహసిల్దార్ ల నుంచి వివరణ కోరడం జరిగింది. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వస్తున్న అర్జీలు నాణ్యత ప్రమాణాలు విషయములో హేతుబద్ధత పాటించక పోవడం పై వివరణ కోరడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో అర్జీలు రీ ఒపెన్ కాకూడదని, ఈ విషయంలో సంబంధిత ఆర్డీఓ లు వ్యక్తిగతంగా పర్యవేక్షణా చెయ్యాల్సి ఉంటుందన్నారు.

ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత క్రమంలో చేపట్టిన కార్యక్రమాలను నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జేసి చిన్న రాముడు తెలిపారు. రానున్న 100 రోజుల కార్యచేరణ ప్రణాళికలను అందజేయడం జరిగిందన్నారు. అందుకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో లక్ష్యాలను నిర్దేశించుకోవాలని తెలిపారు. గృహ నిర్మాణాలు సంబంధించి రాబోయే వంద రోజుల్లో 485 ఇళ్ళ నిర్మాణం పూర్తి చేయాల్సి ఉండగా ఇప్పటివరకు 331 మాత్రమే పూర్తి చేయడంపై వివరణ కోరారు. స్టేజ్ కన్వర్షన్ కింద గతవారం నిర్దేశించిన 1232 ఇళ్లకు గాను, 296 సాధించడం జరిగిందన్నారు. జిల్లాలో 1688 రూఫ్ లెవెల్లోనూ , 3187 రూపు కంప్లీట్ స్థాయిలోను ఉన్నాయని తెలిపారు. ఆయా ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేసేందుకు గ్రామస్థాయిలో లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని తెలిపారు.

ఉపాధి హామీ లక్ష్యం కింద అక్టోబర్ చివరనాటికి 39.09 లక్షల పది దినాల లక్ష్యానికి ఇప్పటివరకు 34.83 (88%) పూర్తి చేశారని, ప్రగతిలో వెనకబడిన మండలాలు లక్ష్యాలను పూర్తి చేయాల్సి ఉంటుంది అన్నారు. కొన్ని మండలాలు 120 శాతం 130 శాతం సాధిస్తుండగా, కొన్ని 70 శాతం మేరకు పరిమితం అవ్వడం ఏమిటి అని ప్రశ్నించారు. వచ్చేవారం నుండి సమీక్ష చేసే సమయంలో వెనుకబడిన మండలాలు స్వయంగా హాజరై వివరణ ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. లక్ష్యసాధనలో వెనుక బడిన మండలాల విషయంలో జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందని ఆయన తెలిపారు.

కార్యాలయ ఆవరణలను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని జిల్లా రెవిన్యూ అధికారి జి నరసింహులు పేర్కొన్నారు. రోజులో కొంత సమయం ఇందుకోసం వెచ్చించాల్సి ఉందన్నారు. రెవెన్యు విభాగం ద్వారా నిర్వహిస్తున్న ఫైల్స్ నిర్వహణ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై నివేదిక అందచేయాలని తెలియ చేశారు. ఈ సమావేశంలో సంబంధిత జిల్లా అధికారులు కలెక్టరేట్ నుంచి పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *