అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
“వన్యప్రాణుల వారం“ సందర్భం గా అక్టోబర్ 1-7 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవవైవిధ్య బోర్డు ఆధ్వర్యంలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ లో బయోడీవర్సిటీ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిధి గా డాక్టర్ తరుణ్ కాకాని, CEO, ABC- అమరావతి బోటింగ్ క్లబ్ హాజరయ్యారు. ఈ ముగింపు వర్క్‌షాప్ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో WWF-India వారి అధ్యక్షతన జరిగింది. APSBB అధికారి గలీబ్ మరియు WWF Hyd డైరెక్టర్ ఫరీదా తంపాల్ మరియు శ్రీనివాస్ పసుపులేటి పాల్గొన్నారు. నేటి సంవత్సరం థీమ్ “ప్రజలు మరియు గ్రహం, వన్యప్రాణులు మరియు పర్యావరణ పరిరక్షణను అనుసంధానం చేయడం”. ఈ సందర్భం గా సామాజిక స్పృహ కలిగినటువంటి కార్పొరేట్ లీడర్ Dr తరుణ్ కాకాని అని , గతం లో అరుదైన జాతుల కోవకి చెందిన సోడర్ బ్యాక్ అటర్స్, రెడ్ ఎరెడ్ స్నైడర్ టర్టిల్ వంటి వన్య ప్రాణుల ను జిల్లా ఫారెస్ట్ అధికారులకి అప్పచెప్పటం అలాగే భవానీ ఐలాండ్ లో ఉన్న బయోడీవర్సిటీ మాపింగ్ చెయ్యటంవంటి కార్యక్రమాలు చేస్తున్నారని ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ బయోడీవర్సిటీ బోర్డు ఆఫీసర్ గాలీబ్ తెలిపారు. అనంతరం కాకాని మాట్లుడుతూ: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని, ముఖ్యంగా నేటి యువత ఒక్కక్కరు 10 మొక్కలను నాటి వాటి సంరక్షణ చూసుకోవాలని అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో పెలికాన్ పక్షులు ఈటేటా పులికాట్ సరస్సు , కొల్లేరు సరస్సు కి వస్తుంటాయని , కానీ వాతావరణ మార్పుల వల్ల అవి రావటం తగ్గాయని, అర్ధంతర వర్షాలు, అకాల తుఫానులు ఎక్కువయ్యని , వీటన్నిటికీ కారణం మనిషి దురాశ అని, మితం గా అవసరాలను పరిమితం చేసుకుని “సస్టైనబుల్ లివింగ్” అలవర్చుకోవాలి. ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలి అని చెప్పారు. ఇండియన్ వైల్డ్లైఫ్ ప్రొటెక్షన్ ఆక్ట్ 1972, ఇండియన్ ఫారెస్ట్ ప్రొటెక్షన్ అండ్ కన్సర్వేషన్ ఆక్ట్ , బయోడీవర్స్ట్ ఆక్ట్ 2002 వంటి అంశాల మీద మాట్లాడి విద్యార్థుల్లో స్ఫూర్తి ని రగిల్చారు. అనంతరం WWF డైరక్టర్ ఫరీదా మాట్లాడుతూ ఏపీఎస్బీబీ వారికి, నాగార్జున యూనివర్సిటీ కి , గతదశాబ్ద కాలం గా ఆంధ్ర ప్రదేశ్ లో WWF కార్యకలాపాలకి అండదండలు అందిస్తున్న కాకాని తరుణ్ కి కృత్జ్ఞతలు తెలిపు చిరు సత్కారం చేసారు.
Tags amaravathi
Check Also
ప్రజాస్వామ్యయుతంగా సంస్థాగత ఎన్నికలు నిర్వహించే పార్టీ తెలుగుదేశం
-శాసననభ్యులు గద్దె రామమోహన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారత దేశంలో జాతీయ రాష్ట్ర స్థాయిల్లో అనేక పార్టీలు …