Breaking News

దుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్న డాక్టర్ తరుణ్ కాకాని

ఇంద్ర‌కీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రముఖ బిజెపి నాయకులు మరియు అమరావతి బోటింగ్ క్లబ్ CEO డాక్టర్ తరుణ్ కాకాని సోమవారం కుటుంబ సమేతంగా శ్రీ కనక దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానాన్ని సందర్శించి మహాచండీ దేవి అవతారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకున్నారు. విజయవాడ పీఠాధిపతి మండప ఆశీర్వచనం ఆశీస్సులు పొందారు. అనంతరం ఆలయ దసరా ఉత్సవాల ఏర్పాట్లపై, మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆలయ ఉత్సవ కమిటీ సభ్యుల సేవలను కొనియాడారు. వృద్ధలకు వీల్ చైర్ ఏర్పాటు, భక్తులకు త్రాగు నీరు ఏర్పాటు చేశారన్నారు. వరదల నుండి ఇతర ప్రకృతి విపత్తుల నుండి బెజవాడవాసులకి విముక్తి కలాగాలని సర్వేజనా సుఖినోభవంతు అని అమ్మవారిని కోరుకున్నట్టు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *