విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఎపిజిఇఎ) రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు కె.ఆర్.సూర్యనారాయణ అధ్యక్షతన ఈనెల 5వ తేదీన 26 జిల్లాల సంఘ ప్రతినిధులు మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సమావేశం జరిపి ఏకగ్రీవంగా నూతన ప్రధాన కార్యదర్శిగా ఎం.రమేష్‌కుమార్‌ను ఎన్నిక చేయడం జరిగింది. దీనిని పురస్కరించుకుని రాష్ట్ర సంఘ కార్యాలయంలో నూతన ప్రధాన కార్యదర్శిగా సోమవారం సాయంత్రం 4.30ని.లకు పదవీ బాధ్యతలు స్వీకరించారు. కె.ఆర్.సూర్యనారాయణ నేతృత్వంలో ఎం.రమేష్‌కుమార్ పదవి బాధ్యతలు స్వీకరణ జరిగింది. కె.ఆర్.సూర్యనారాయణ మాట్లాడుతూ ఎపిజిఇఎ సభ్యులందరూ ఎం.రమేష్‌కుమార్‌తో సమన్వయంతో కలసి కట్టుగా వుండి ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి సహకరించాలని కోరి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎం.రమేష్‌కుమార్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె.ఆర్.సూర్యనారాయణ నేతృత్వంలో ప్రభుత్వ పెద్దలతో అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆత్మ గౌరవం హక్కులు కాపాడుటకు శక్తివంచన లేకుండా పనిచేస్తానని తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన సంఘ నాయకులకు ఎన్నుకున్న రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు అన్ని జిల్లాల కార్యవర్గ సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. అనంతరం భవిష్యత్ కార్యాచరణ, ప్రాధాన్యత క్రమంలో అన్ని సమస్యల పరిష్కారాన్ని గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు బి.సుగుణ, జి.నాగసాయి, జి.కిషోర్‌కుమార్, సిహెచ్ వెంకటేశ్వరరెడ్డి, ఎం.విజయ్‌కుమార్, టి.వి.ఎస్.రామారావు, విజయవాడ నగర శాఖ ప్రతినిధులు మరియు ఐక్యవేదిక సెక్రటరీ జనరల్ బాజీ పఠాన్ మరియు ఐక్యవేదిక నాయకులు కరణం హరికృష్ణ, పాపారావు, కేదారేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News