గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఒడిశా మరియు తెలంగాణ రాష్ట్రాల్లోని మున్సిపల్ కార్పొరేషన్లలో ఆస్తి పన్ను, నీటి సరఫరా మరియు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ అమలు తీరు, ఘన వ్యర్ధాల నిర్వహణ స్టడీ టూర్ లో భాగంగా మంగళవారం భువనేశ్వర్ మునిసిపల్ కార్పోరేషన్ లోని వివిధ విభాగాల పనితీరుని పరిశీలించిన గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్. ఈ సందర్భంగా కమిషనర్ కి తొలుత భువనేశ్వర్ మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ రాజేష్ ప్రభాకర్ పాటిల్ స్వాగతం పలికి కార్పోరేషన్ కాన్ఫరెన్స్ హాల్లో వివరాలు తెలిపారు. అనంతరం గుంటూరు కమిషనర్ బృందానికి విభాగాల వారీగా వివరించడానికి ప్రత్యేకంగా అధికారులను కేటాయించగా, కార్పోరేషన్ లో కమాండ్ కంట్రోల్ రూమ్, వాటర్ ఫిల్టరేషన్ పాయింట్స్, డిస్ట్రిబ్యూషన్ విధానం, త్రాగునీటి సరఫరా మరియు చార్జీలు, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ లను పరిశీలించారు.
Tags guntur
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …