గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థలోని పట్టణ ప్రణాళిక అధికారులకు వార్డ్ ల వారీగా విధులు కేటాయించడం జరిగిందని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఇటీవల ప్రభుత్వం చేపట్టిన ఉద్యోగుల బదిలీల్లో గుంటూరు నగరపాలక సంస్థలో పట్టణ ప్రణాళిక విభాగంలో కొందరు అధికారులు బదిలీ కావడం, మరి కొందరు బదిలీలో రావడం జరిగిందన్నారు. గుంటూరు నగరంలోని 4 జోన్లకు ఎలక్షన్ వార్డ్ ల వారీగా అధికారులకు విధులు కేటాయించామని తెలిపారు. మొదటి జోన్ లోని 1,2,4,47,48,50 నుండి 57 వ వార్డ్ ల వరకు డిప్యూటీ సిటి ప్లానర్ గా జె.సూరజ్ కుమార్, ఎస్.ఫజులార్ రెహ్మాన్ ఏసిపి (ఇంచార్జి), సిహెచ్.సువర్ణకుమార్ టిపిఎస్, మరో ముగ్గురికి టిపిబిఓ(ఇంచార్జి)లకు విధులు కేటాయించడం జరిగింది.
రెండవ జోన్ లోని 3,5 వార్డ్ ల నుండి 17వ వార్డ్ ల వరకు డిప్యూటీ సిటి ప్లానర్ గా జె.సూరజ్ కుమార్, డి.మల్లికార్జున ఏసిపి (ఇంచార్జి), ఎస్.కె.రసూల్ టిపిఎస్, మరో ముగ్గురికి టిపిబిఓ(ఇంచార్జి)లకు విధులు కేటాయించడం జరిగింది.
మూడో జోన్ లోని 18 వార్డ్ నుండి 31వ వార్డ్ ల వరకు డిప్యూటీ సిటి ప్లానర్ గా జె.సూరజ్ కుమార్, సిహెచ్.వెంకటేశ్వర్లు ఏసిపి, ఏ.లక్ష్మణ స్వామి టిపిఎస్, మరో ముగ్గురికి టిపిబిఓ(ఇంచార్జి)లకు విధులు కేటాయించడం జరిగింది.
నాల్గవ జోన్ లోని 32 వార్డ్ నుండి 49వ వార్డ్ ల వరకు డిప్యూటీ సిటి ప్లానర్ గా జె.సూరజ్ కుమార్, ఎస్.ఫజులార్ రెహ్మాన్ ఏసిపి (ఇంచార్జి), కె.వి.సత్యనారాయణ టిపిఎస్, మరో ముగ్గురికి టిపిబిఓ(ఇంచార్జి)లకు విధులు కేటాయించడం జరిగింది.
అలాగే రీ సర్వేకి డిసిపి సూరజ్ కుమార్, ఏసిపి వెంకటేశ్వర్లులకు, డిస్ప్లే డివైస్ పర్మిషన్ ఫీజుల పర్యవేక్షణకు ఎస్.ఫజులార్ రెహ్మాన్ ఏసిపి (ఇంచార్జి)కి భాధ్యతలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశామన్నారు. జిఎంసి నూతనంగా కేటాయించబడ్డ సర్వేయర్లు షేక్.మహబూబ్ సుభాని (గుంటూరు తూర్పు నియోజకవర్గం, ఏటుకూరు, బుడంపాడు, పొత్తూరు, చౌడవరం, గోరంట్ల, అమరావతి రోడ్ తూర్పు వైపు, రెడ్డిపాలెం), బి.లక్ష్మీనారాయణ (గుంటూరు పశ్చిమ నియోజకవర్గం, అంకిరెడ్డిపాలెం, నల్లపాడు, పెద్దపలకలూరు, అడవితక్కెళ్ళపాడు, గోరంట్ల, అమరావతి రోడ్ పశ్చిమ వైపు) లకు కూడా ప్రాంతాలు కేటాయించామని తెలిపారు.
Prajavartha Online Telugu News