Breaking News

సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు చర్యలు… : జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం అమరావతి రాష్ట్ర సచివాలయం నుంచి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సాగునీటి వ్యవస్థకు పునరుజ్జీవం తీసుకురావాలని నిర్ణయించారని, నిర్వీర్యమైన సాగు నీటి వ్యవస్థను సాగునీటి సంఘాల ద్వారా రైతుల ప్రాతినిధ్యంతో కాలువల పూడిక, మరమ్మతులు, గేట్లు, గట్ల బలోపేతం వంటి వాటికి నిర్వహాణ, పర్యవేక్షణకు సాగునీటి సంఘాలు పనిచేస్తాయని, వీటికి త్వరలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు.

జిల్లాలో ఇరిగేషన్ శాఖకు సంబంధించిన ఎస్ఈ పోస్టు ఖాళీగా ఉందని, భర్తీ చేయాలని కలెక్టర్ మంత్రిని కోరగా, త్వరలో అందుకు సంబంధించిన అధికారిని నియమిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అనంతరం జిల్లా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ ప్రభుత్వ సూచనల మేరకు ఆయకట్టు, డిస్ట్రిబ్యూటరీలు, ప్రాజెక్టుల పరిధిలో కొత్తగా వచ్చిన ప్రాంతాలను కలిపి ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని కలెక్టర్ ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్లో డిఆర్ఓ కె చంద్రశేఖర రావు, ఇరిగేషన్ శాఖ ఈఈ లు పీవీ కృష్ణారావు, కొడాలి బాబు, మచిలీపట్నం, గుడివాడ, ఉయ్యూరు ఆర్టీవోలు కే స్వాతి, జి బాలసుబ్రమణ్యం, బిఎస్ హేలా షారోన్ తదితరులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *