Breaking News

పల్లె పండుగ – పంచాయతీ వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలి : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్

-జిల్లా లో పల్లె పండగ పంచాయతీ వారోత్సవాలు నిర్వహించుటకు సిద్ధంగా ఉన్నాము : కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
పల్లె పండుగ- పంచాయతీ వారోత్సవాలు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ తెలిపారు. మంగళవారం ఉదయం అమరావతి సచివాలయం నుండి జిల్లా కలెక్టర్లు తో ఈ నెల 14 నుండి 20 వరకు జిల్లాలలో నిర్వహించే పల్లె పండుగ- పంచాయతీ వారోత్సవాల నిర్వహణ పై జిల్లా కలెక్టర్లు తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తిరుపతి జిల్లా నుండి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ సంబందిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పల్లె పండుగ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, సర్పంచులు, ప్రజా ప్రతినిధులను భాగస్వాములను చేయాలని తెలిపారు. గత ఆగస్టు 23న రాష్ట్రవ్యాప్తంగా 13,325 పంచాయతీల్లో ఒకే రోజున గ్రామ సభలు నిర్వహించి తీర్మానాలు చేయించిన పనులకు కలెక్టర్లే పరిపాలన అనుమతులు ఇవ్వడం జరిగిందని, అన్ని పనులు 14 నుంచి వారం రోజుల వ్యవధిలో శంకుస్థాపనలు చేయించి,సంక్రాంతి పండుగ లోగా పనులు అన్నియు పూర్తి చేయించాలని కలెక్టర్లును ఆదేశించారు. ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపోనెంట్ నిధులు రూ.2500 కోట్లతో దాదాపు 20వేల పనులకు శంకుస్థాపనలు జరగనున్నాయని ఉప ముఖ్యమంత్రి తెలిపారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పల్లె పండగ పంచాయతీ వారోత్సవాలకు పూర్తి సిద్దంగా ఉన్నామని తెలిపారు. భూమి పూజ చేయాల్సిన అన్ని పనులను గుర్తించామని తెలిపారు. ప్రజాప్రతినిధులకు అందరికీ ప్రభుత్వం ద్వారా స్వాగతించి వారి షెడ్యూల్ ని తీసుకోవడం షెడ్యూల్ తయారు చేయడం జరిగిందని తెలిపారు. పంచాయతీలకు సంబందించిన సమాచార బోర్డులను పెట్టడం జరిగిందని అన్నారు. ప్రతి పంచాయతీలో ప్రభుత్వ భవనాల కాంపౌండ్ వాల్స్, స్మశాన వాటికలు, నాలెడ్జ్ బోర్డ్స్, సి.సి. రోడ్లు, బి.టి రోడ్లు గుర్తించిన పనులకు రూ.74 కోట్లు మంజూరు చేసామని ఇంకా 25 కోట్లు మంజూరు చేయవలసి ఉందని కలెక్టర్ ఉప ముఖ్యమంత్రికి తెలిపారు. తిరుపతి జిల్లాలో ఉపాది హామీ పనులలో భాగంగా వ్యక్తిగత పనులను కల్పించడం జరుగుతుందని, జిల్లాలో ఫారంపాండ్స్ పనులు ఇప్పటికే టార్గెట్ పూర్తి చేసామని తెలిపారు. ప్రతి పంచయతీ కవర్ చేసుకొనే ఉద్దేశంతో అనిమల్ షెల్టర్స్ 2,3 మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఇసుక, సిమెంట్ అందుబాటులో ఉందని తెలిపారు.

జిల్లా కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ లో డిఆర్ఓ పెంచల్ కిషోర్, గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, పంచాయతీ అధికారిణి శ్రీమతి సుశీల దేవి, డ్వామా పిడి శ్రీనివాస ప్రసాద్, గ్రామీణ నీటి సరఫరా,పంచాయతీరాజ్ ఎస్ ఈ లు, జడ్పీ డిప్యూటీ సీఈఓ మరియు సంబందిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *