Breaking News

అక్టోబర్ 14 నుంచి 21 వరకు పల్లె పండుగ రహదారి , డ్రెయిన్స్ వారోత్సవాలు

-స్ధానిక ప్రజా ప్రతినిధులు సమక్షంలో శంఖుస్థాపన చేపట్టాలి..
-ఆగస్టు 23న గ్రామ సభలో గుర్తించిన పనులను నిర్దిష్ట సమయంలో పూర్తి చెయ్యాలి
-సంక్రాంతి నాటికి ఆయా పనులను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకుని రావాలి
-కలెక్టర్ పి ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు జిల్లాలోని 300 గ్రామ పంచాయతీల పరిధిలో ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కింద పల్లె పండుగ వారోత్సవాలను నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల పండగను పురస్కరించుకుని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్‌ కల్యాణ్‌ మంగళవారం అమరావతి నుంచి జిల్లా కలెక్టర్ లు, ఇతర సమన్వయ శాఖల అధికారులకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా దిశా నిర్దేశనం చెయ్యడం జరిగింది .

స్ధానిక కలక్టరేట్ దృశ్య మాధ్యమ సమావేశ మందిరం నుంచి కలెక్టర్ పి. ప్రశాంతి, డ్వామా నాగ మహేశ్వర రావు, పి ఆర్ ఎస్ ఈ ఎండీ. అలీముల్లా , డివిజనల్ పంచాయతీ అధికారి ఎమ్. నాగలత, డి ఎల్డివో లు పి . వీణా దేవి, సెల్వ రెడ్డీ, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఐదేళ్ల తర్వాత పల్లెలకు తొలిసారి అభివృద్ధి పరుగు వడివడిగా సిద్ధమవుతూ రాష్ట్రంలో ప్రణాళికలు సిద్దం చేసుకోవడం, 3 వేల కిలోమీటర్ల సిమెంటురోడ్లకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. రూ.4500 కోట్లతో ఉపాధి, ఆర్థిక సంఘం నిధులతో పెద్దఎత్తున నిర్మాణ పనులు చేపట్టి సంక్రాంతికల్లా అందుబాటులోకి తేవడమే లక్ష్యం  అన్ని సమన్వయ శాఖలు పనిచేయాల్సి ఉందన్నారు

ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, తూర్పు గోదావరి జిల్లాలో అక్టోబర్ 14 నుంచి 21 వరకూ నిర్వహించ తలపెట్టిన పల్లె పండుగ వారోత్సవాలు కు అనుగుణంగా పూర్తి స్థాయిలో సన్నద్ధం అవ్వడం జరిగిందన్నారు. స్ధానిక శాసన సభ్యులు, ప్రజా ప్రతినిధులు లని సంప్రదించి వారిని భాగస్వామ్యం చేసే దిశగా వర్క్ షెడ్యూలు ఖరారు చేసినట్లు తెలిపారు. జిల్లాలో ఆగష్టు 23 న గ్రామ సభలు నిర్వహించి, పనులని గుర్తించడం జరిగిందన్నారు. గ్రామ సభలు నిర్వహించిన నేపధ్యంలో ప్రాధాన్యత పనులని గుర్తించడం జరిగిందన్నారు. ఆయా పనులకు అక్టోబర్ 14 నుంచి 21 వరకూ ప్రారంభించడానికి రూట్ మ్యాప్ సిద్ధంగా ఉందన్నారు. సంక్రాంతి నాటికి ఆయా పనులను పూర్తి చెయ్యాల్సి ఉండేలా రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నట్లు కలెక్టరు వివరించారు. పంచాయతీ రాజ్ , ఆర్డబ్ల్యూఎస్ కు సంబంధించి 999 పనులకి గాను రూ.96.71 కోట్లతో పరిపాలన పరమైన అమోదం ఇవ్వడం జరిగిందన్నారు. ఆర్డబ్ల్యూఎస్ – డ్రెయిన్స్ పనుల చెందిన సాంకేతిక అంశాలకు సంబంధించి రాష్ర్ట స్థాయి అధికారులు దృష్టికి తీసుకు వెళ్లినట్లు తెలిపారు. పంచాయతీరాజ్ సంబంధించి 698 సీసీ రోడ్లు పనులను రూ.67. 73 తో, ఆర్డ డబ్ల్యు ఎస్ ద్వారా 301 డ్రైనేజీ పనులు రూ.28. 98 కోట్ల తో ప్రతిపాదించినట్లు తెలియ చేశారు. జిల్లాలో ఆయా ప్రాధాన్యత పనులు చేపట్టేందుకు ఇసుక సమస్య లేదని, సిమెంట్ స్థానికంగా సమకుర్చుకోనున్నట్లు తెలిపారు. నిర్మాన్ పోర్టెల్ ద్వారా సిమెంట్ సరఫరా చెయ్యడం కోసం చర్యలు తీసుకోవాలని కోరారు.

అనంతరం మండల అభివృద్ది అధికారులకు కలెక్టరు పి ప్రశాంతి దిశానిర్దేశం చేస్తూ, అక్టోబర్ 14 నుంచి 21 వరకు స్థానిక ప్రజాప్రతినిధులను కలుపుకుని పల్లె పండుగ వారోత్సవాలు ఒక నిర్దుష్ట కార్యాచరణ ప్రణాళికను అనుసరించి చేపట్టాల్సి  ఉంటుందన్నారు. సీసీ రోడ్లు, ట్రెంచేస్ , గోకులాలు, ఫారమ్ పాంట్స్, హార్టికల్చర్ సాగు విస్తీర్ణం పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకం కింద మెటీరియల్ కంపోనెంట్ పనులని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని ఆదేశించారు. ఉపాధిహామీ పథకం అమలు చేస్తున్న పనుల వివరాలు ఆయా గ్రామాలలో ప్రదర్శించాలన్నారు. అన్నీ మండలాల్లో గ్రామ పంచాయతీ పరిధిలో ఉపాధి సిమెంట్‌రోడ్ల, డ్రైయినేజ్ పనులు మంజూరు చేశామన్నారు. ఈ నిర్మాణాలకు భూమి పూజ ఈ నెల 14 నుంచి ప్రారంభించేందుకు పిఆర్ , ఆర్ డబ్ల్యు ఎస్ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి  పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మండలాల వారీగా పల్లెపండగ-వారోత్సవాలనుజిల్లా పంచాయతీ అధికారి, డ్వామా పిడి ద్వారా ఏర్పాట్లు చేశామన్నారు. గ్రామ స్థాయి లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, స్థానికసంస్థల ప్రతినిధులను భాగస్వామ్యంతో పండగ వాతావరణంలో భూమి పూజలు చేసి పనులు ప్రారంభించాలని అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *