-ప్రభుత్వ సబ్సిడీతో గృహా వినియోగదారులకి ప్రయోజనం
-1 కిలో వాట్ నుంచి 3 కిలో వాట్ వరకు గరిష్టంగా రూ.78 వేల వరకూ రాయితీ
-జిల్లాలో పీఎం సూర్య ఘర్ కోసం దరఖాస్తు చేసుకున్న 480 మంది
-జిల్లాలో 218 గృహలలో సోలార్ యూనిట్స్ ఏర్పాటు చేశాము
-యూనిట్ ఏర్పాటు, సమస్యల పరిష్కారం కోసం 1912 టోల్ ఫ్రీ నెంబర్
-యూనిట్స్ ఏర్పాటు అనంతరం వినియోగదారునికి మెరుగైన సేవలు అందించాలి
-వినియోగదారులకు అందించే సేవలే ఏజెన్సీ పనితీరుకు ప్రామాణికం
-గోడ ప్రతులను ఆవిష్కరించిన కలెక్టర్, ఇతర అధికారులు
-కలెక్టర్ పి ప్రశాంతి
-ఎస్ ఈ – కే. తిలక్ కుమార్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రీన్ మరియు క్లీన్ ఎనర్జీ ప్రోత్సహం అందించే క్రమంలో “పిఎం సూర్య ఘర్.. ముఫ్త్ బిజిలి యోజన ” పథకం ప్రయోజనాలను ప్రజల్లోకి సమర్ధవంతంగా తీసుకుని వెళ్లాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పిలుపు నిచ్చారు.
మంగళవారం మధ్యాహ్నం కలక్టరేట్ సమావేశ మందిరంలో ” పిఎం సూర్య ఘర్.. ముఫ్త్ బిజిలి యోజన” తొలి జిల్లా స్థాయి కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ, ఏకో ఫ్రెండ్లీ ఎనర్జి ఉత్పాదన ప్రోత్సహం అందించే ప్రయత్నం లో భాగంగా వినియోగ దారులు స్వచ్ఛందంగా సౌర విద్యుత్ యూనిట్స్ స్థాపన కోసం విస్తృత స్థాయిలో ప్రచారం కల్పించడం పై ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాల్సి ఉందన్నారు. రాయితీ తో కూడి మీ ఇంటిపై సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసినట్లు అయితే విద్యుత్ బిల్లు చార్జీలను తగ్గించుకునే అవకాశం ఉందని తెలియ చేయడంతో పాటు ప్రభుత్వ పరంగా కలిగే ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలి అని పేర్కొన్నారు. ఎటువంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా www.pmsurya ghar.gov.in / APEPDCL వెబ్ సైట్ లో పిఎం సూర్య ఘర్ యోజన పథకం కింద పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. గ్రామ సచివాలయంలో, ప్రభుత్వ కార్యాలయాల్లో, బహిరంగ ప్రదేశాల్లో గొడప్రతులని ఏర్పాటు చెయ్యాలని సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది తెలిపారు. రెండు లక్షల వరకూ బ్యాంకర్లు ఏటువంటి ష్యురిటి లేకుండా పీఎం సూర్య ఘర్ సోలార్ యూనిట్స్ ఏర్పాటు కు రుణాలను అందిస్తున్నట్లు తెలిపారు. ఒక కిలో వాట్ కి రూ.70 వేలలో ప్రభుత్వ సబ్సిడీ 30 వేలు, బ్యాంకు రుణం 40 వేలు గా తెలిపారు. ఇదే దామాషా ప్రకారం 2 కిలో వాట్ కి రూ.60 వేలు, 3 కిలో వాట్ కి రూ.78 వేలు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది అని పేర్కొన్నారు. యూనిట్స్ స్థాపన కొరకు పేర్లు నమోదు కోసం జి ఎస్టీ తో అప్లికేషన్ ఫీజ్ రూ.1180, సింగిల్ ఫేజ్ మీటరు కోసం 1382, త్రీ ఫజ్ మీటరు కోసం 2771 లు చెల్లించాల్సి ఉంటుందన్నారు. స్వంత గృహలు ఉన్న వ్యక్తులు తగిన ఇంటి ధ్రువపత్రాలతో బ్యాంకర్ల ని సంప్రదించాలన్నారు.
పర్యావరణ పరిరక్షణ దిశలో సోలార్ యూనిట్స్ ఏర్పాటు ద్వారా కేంద్ర ప్రభుత్వం అందజేసే సబ్సిడీల ద్వారా ప్రయోజనం పొందాలని తూర్పు గోదావరి జిల్లా ఏపీఈపిడిసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ కె.. తిలక్ కుమార్ తెలిపారు. సోలార్ యూనిట్స్ స్థాపన కొరకు జిల్లాలో 21 ఏజెన్సీస్ విద్యుత్ సంస్ధ తో ఎన్ ప్యానల్మెంట్ అవ్వడం జరిగిందన్నారు. వినియోగదారుని ఆసక్తి కి అనుగుణంగా ఏజెన్సీస్ ను ఎంపిక చేసుకోవచ్చునని, వాటి వివరాలు వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచామని తెలిపారు. యూనిట్స్ ఏర్పాటు, ఫిర్యాదులు స్వీకరించేందుకు 1912 టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. మరింత సమాచారం కొరకు సంప్రదించాలని ఆయన కోరారు. ఒక కిలో వాట్ యూనిట్ ద్వారా ఏడాదికి ఎన్ని వేలు రెండు కిలో వాట్ యూనిట్ ద్వారా 20000 మూడు కిలో వాట్ యూనిట్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా 32,400 ప్రతి ఏట ఆదా చేసుకోవచ్చని ఆయన తెలిపారు. విద్యుత్ వినియోగం, ఉత్పాదన దామాషా ప్రకారం బిల్లింగు ఉంటుందని, ఆమేరకు ఉత్పత్తి కంటే వినియోగం తక్కువ ఉంటే వినియోగదారుని బ్యాంకు ఖాతాకు జమ చేస్తామని తెలిపారు. జిల్లాలో ప్రతినెల 100 యూనిట్ల స్థాపన లక్ష్యంగా నిర్దేశించుకున్నామని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమానికి ఎపిఈపిడిసీఏల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ కే. తిలక్ కుమార్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లు వివి కిషోర్ (టెక్నికల్), నక్కపల్లి శ్యామూల్ (టౌన్) డీ. శ్రీధర్ వర్మ (రూరల్) , ఎన్ ఎన్ అప్పారావు (నిడదవోలు), జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ డి వి వి ప్రసాద్, విద్యుత్ శాఖ, బ్యాంకు అధికారులు, సోలార్ యూనిట్స్ మార్కెటింగ్, ఏజన్సీ ప్రతినిధులు పాల్గొన్నారు.