విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
EPS. 95 పెన్షనర్ల ఆల్ ఇండియా కమిటీ మరియు APRPA రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ రోజు విజయవాడ దుర్గ అగ్రహరం లొ గల సహాయ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ జిల్లా కార్యాలయం ముందు పెన్షనర్ల ధర్నా జరిగింది. ఈ ధర్నానుద్దేశించి రాష్ట్ర అధ్యక్షులు NA శాస్త్రి మాట్లాడుతూ గత ఆగస్టు 6,7,8 తేదీలలో ఢిల్లీలో జరిగిన జాతీయ ధర్నా సందర్భంగా కేంద్ర మంత్రి మాన్ షుక్ మాండా వియా పెన్షనర్ల సమస్యలను తెలుసుకొని ఒక నెలరోజుల వ్యవధి లో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కానీ నేటికీ ఏ సమస్య పరిష్కారం జరగలేదని ఆందు వలన మరల ఆందోళన చేయ వలసి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెన్షనర్ల న్యాయ బద్ధమైన డిమాండ్లు కనీసపెన్షన్ 9 వేల రూపాయలు, మరియు కరువు భత్యం అందరికి హయ్యర్ పెన్షన్ మొదలుగా డిమాండ్లు సాధించే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఇంకా ఈ ధర్నాకు హాజరైన నగర సి ఐ టి యు నాయకులు MV సుధాకర్ మాట్లాడుతూ పాలకులు మారి పాలక విధానాలు మారితేనే సమస్యలు పరిష్కరించ బడతాయని అందు వలన పెన్షనర్లు కూడా రాజకీయ పోరాటం చేయ వలిసిందేనని తెలియ చేశారు. ధర్నా లో సమస్యలపై పెన్షనర్లు పెద్ద ఎత్తున నినదించారు. ఇంకా జిల్లా కార్యదర్శి శ్రీనివాసరావు, LIC నాయకులు MN పాత్రుడు మరియు అవనిగడ్డ పున్నా రావు మాట్లాడిన అనంతరం PF జోనల్ కమిషనర్ కు వినతి పత్రం ఇచ్చి సమస్యల పై చర్చించారు. వినతి పత్రాన్ని కేంద్ర మంత్రివర్యులకు పంప వలసిందిగా కోరారు. ధర్నా కు జిల్లా నలు మూలలు నుండి వచ్చిన పెన్షనర్లకు ధన్యవాదములు తెలియ చేశారు.
Tags vijayawada
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …