-నోడల్ ఏజెన్సీస్ నుంచి దరఖాస్తులు ఆహ్వానం
-కలెక్టర్ పి ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎస్సి ఎస్టీ లకి చెందిన డిస్సికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు వసతి తో కూడిన శిక్షణ అందజేసేందుకు ఆసక్తి కలిగిన ఏజెన్సీస్ నుంచీ దరఖాస్తులను ఆహ్వానిస్తూన్నట్లు జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి గురువారం ఒక ప్రకటనలో తెలియజేశారు. సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖలు, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా 5050 ఎస్సి, ఎస్టీ విద్యార్ధులకు రెసిడెన్సియల్ విధానంలో డీఎస్సీ, శిక్షణ ఇచ్చుటకు నిర్ణయంచడం జరిగిన నేపధ్యంలో ఈ మేరకు ఆసక్తి కలిగిన నోడల్ ఏజెన్సీస్ నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది అని పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో ఎస్సీ ఎస్టీ శిక్షణ సంస్థల యందు సాంఘిక / గిరిజిన సంక్షేమ శాఖలు నిర్వహిస్తున్న స్టడీ సర్కిల్ లలో నందు నిర్వహించబడుతుందని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకునే శిక్షణ సంస్థలు కనీసం గత రెండు డిఎస్సీ రిక్రూట్మెంట్లకు కోచింగ్ ఇచ్చిన అనుభవం, గతంలో నిర్వహించిన డీఎస్సీ రిక్రూట్మెంట్ లో శిక్షణ ఇచ్చిన అభ్యర్థులలోకనీసం 100 మంది ఉపాధ్యాయులుగా ఉద్యోగాలను పొంది ఉండాలని, ఇతర నియమ నిబంధనలు కోసం https:// tender.apeprocurement.gov.in ను సందర్శించాలని తెలియ చేశారు.శిక్షణ సంస్థలు నిర్ణీత ఫారం ను 7-10-2024 నుండి డౌన్లోడ్ చేసుకునేందుకు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ధరఖాస్తు చేసుకోవడానికి అక్టోబరు 21 వ తేదీ చివరి తేదీ అని ఆ ప్రకటనలో తెలిపారు.