విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సబ్ యూనిట్-5 పరిధిలోని దేవి నగర్, యూపీహెచ్ సి నందు గల దావు బుచ్చియ్య కాలనీ నందు గల జి.వి.ఆర్.నగర్ నందు అనుమానిత డెంగ్యూ కేసు గురించి ఫీవర్ సర్వే నిర్వహించడమైనది. దీనిలో భాగముగా పఠాన్ గఫర్ ఏరియానుండి 150 గృహములను సందర్శించి జ్వరముల గురించి ఆరా తీయటం జరిగింది. ఒక్క ఫీవర్ కేసు కూడా నమోదు కాలేదు. ఈడీస్ లార్వా సర్వే 150 ఇళ్లు మునిసిపల్ కార్పొరేషన్ వారి సిబ్బందితో కలిసి చేయడం జరిగింది చుట్టుపక్క ప్రాంత ప్రజలకు ఫ్రైడే గురించి మరియు పరిసరాల పరిశుభ్రత గురించి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమం వైద్య ఆరోగ్య శాఖ నుండి జిల్లా మలేరియా అధికారి డాక్టర్ మోతీ బాబు మరియు సబ్ యూనిట్ అధికారి కె రాజాంరాజు సమక్షంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్లు డి.ఈ. పాలరీస్, పి.నీరజ కుమారి మరియు హెల్త్ అసిస్టెంట్లు, ఉమన్ హెల్త్ సెక్రటరీలు, శానిటరీ సెక్రటరీలు మరియు ఆశాలు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News