-అక్టోబరు 24 వరకూ అభ్యంతరాలు స్వీకరణ
-ఇన్చార్జి డి ఎస్ డబ్ల్యూ వో సందీప్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గౌరవ సుప్రీం కోర్టు న్యూడిల్లి మరియు ప్రభుత్వం వారి ఆదేశానుసారం తూర్పు గోదావరి జిల్లాలో మాన్యువల్ స్కావెంజర్స్ మరియు ఇస్-సానిటరి లెట్రిన్స్ వివరముల పై సర్వే చేపట్టి నట్లు ఇన్చార్జి జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి ఎం సందీప్, శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. సర్వే నందు తూర్పు గోదావరి జిల్లాలో మాన్యువల్ స్కావెంజర్స్ మరియు ఇస్-సానిటరి లెట్రిన్స్ లేవని జిల్లా పంచాయితీ కార్యాలయము , జిల్లాలోని అన్ని మున్సిపల్ కార్పోరేషన్ కార్యాలయముల నుండి నివేదికలు అందినవని తెలియ చేశారు. నివేదికలు ఆధారంగా తూర్పు గోదావరి జిల్లా కలెక్టరు పి. ప్రశాంతి జిల్లాని మాన్యువల్ స్కావెంజింగ్ ఫ్రీ ( లేని) జిల్లాగా ప్రకటించడం జరిగినదని తెలిపారు. ఈ విషయంపై ఏమైనా అభ్యంతరములు ఉన్నచో ది.24.10.2024వ తేది లోపు సంబంధిత మున్సిపాలిటి/మండల ప్రజా పరిషత్ అధికారులు ద్వారా మీ వివరములను జిల్లా షెడ్యుల్ కులముల సంక్షేమ మరియు సాధికారత కార్యాలయము, ఆర్డీవో కార్యాలయం ఆవరణ, రాజమహేంద్రవరం , తూర్పు గోదావరి జిల్లా వారికీ తెలియ చేయ వలసినదిగా కోరడమైనది.