Breaking News

పాపికొండలు విహారం కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు

-కంట్రోల్ రూమ్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి.
-బోటింగ్ ఆపరేటర్లు తో సమావేశం
-ప్రాంతీయ సంచాలకులు వి స్వామీ నాయుడు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గండిపోచమ్మ బోటింగ్ పాయింట్ నుండి పేరంటాలపల్లి వరకు, పోచవరం బోటింగ్ పాయింట్ నుంచి పేరంటాలపల్లి వరకు ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక శాఖ నిర్వహిస్తున్న బోటింగ్ కార్యకలాపాల నిర్వహణ విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని టూరిజం రాజమండ్రి హబ్ పర్యటక ప్రాంతీయ సంచాలకులు వి స్వామీ నాయుడు తెలియ చేశారు.

గురువారం స్థానిక రాజమహేంద్రవరం బోటింగ్ కంట్రోలర్ రూమ్ నందు పాపికొండలు బోటింగ్ గురించి బోట్ ఆపరేటర్లు తీసుకోవలసిన జాగ్రత్తలు విషయమై పర్యాటకశాఖ అధికారులు ప్రైవేటు బోటు ఓనర్లతో సమావేశం నిర్వహించారు. ప్రతి ప్రైవేటు బోటు ఆపరేటరు బోటుకు సంబంధించి పర్యాటక శాఖ నుంచి నిరభ్యంతర పత్రము, ఇరిగేషన్ శాఖ నుండి రూట్ పర్మిషన్ , మారిటైం బోర్డు నుంచి బోటు లైసెన్సు పొంది ఉండాలన్నారు. అవి వాలిడిటీలో ఉండాలని ప్రతి బోటులో లైఫ్ సేవింగ్ మరియు ఫైర్ ఫైటింగ్ పరికరాలు ఉండాలన్నారు. సిలిండర్లు బోట్లో తీసుకు వెళ్ళరాదని ఓనర్స్ అసోసియేషన్ కి పర్యాటక అధికారులు తెలియజేశారు. ప్రయాణీకుల చిరునామా, మొబైల్ నెంబర్ తో సహా పూర్తి వివరాలను నమోదు చేయాలని కంట్రోల్ రూమ్ సిబ్బందిని ఆదేశించారు. పరిమితికి మించి ఓవర్ లోడింగ్ ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరాదని, ఈ విషయమై నిర్లక్ష్యం గా ఉన్న సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రైవేట్ బోట్స్ లో పనిచేసే సిబ్బందికి అందరికి ఐడెంటిటీ కార్డ్స లు ఇవ్వాల్సిందిగా ప్రైవేట్ బోట్ ఓనర్స్ కి సూచించారు. లైసెన్స్ పొందిన డ్రైవర్లు మాత్రమే బోట్స్ నడపాలని, బోట్లో ప్రయాణించే టూరిస్ట్ లకి, బోటులో పని చేసే స్టాప్ కి అందరికీ ఇన్సూరెన్స్ ఉండాలని తెలిపారు. బోట్ ప్రారంభం అయ్యే ముందుగా ప్రయాణికులకు ప్రయాణం లో పాటించవలసిన జాగ్రత్తలను తెలపాలని, వాకి టాకీ లను ఛార్జింగ్ లో ఉంచుకోవాలని తెలిపారు. బోట్ వెళ్ళినప్పటి నుంచి తిరిగి వచ్చేవరకు కంట్రోల్ రూమ్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో డివిజనల్ మేనేజర్ సిహెచ్, పవన్ కుమార్, వాటర్ ఫ్లీట్ అసిస్టెంట్ మేనేజర్ ఆర్. గంగ బాబు, గండి పోచమ్మ బోటింగ్ కంట్రోల్ రూమ్ మేనేజర్ బి. సాంబశివరావు, రాజేష్, ప్రైవేట్ బోర్డ్ ఆపరేటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు బి. శ్రీనివాసరావు , జి జి మురళి రాము, బి రాము, ప్రకాష్ రావు , మోహన్ రావు , మంగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *