-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శుక్రవారం ఉదయం దసరా నవరాత్రుల ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు. సీతమ్మ పాదాలు దగ్గర ఉన్న కన్వీయర్ బెల్ట్ ద్వారా తీస్తున్న రెడ్ క్లాత్ ని పరిశీలించారు. రెడ్ క్లాత ఘాట్ల పైన ఎక్కడ ఉండకుండా పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా చేయాలని అక్కడున్న సిబ్బందిని ఆదేశించారు. దసరా నవరాత్రుల ఉత్సవాల్లో అమ్మవారి దర్శనానికి వచ్చే ప్రజలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నవరాత్రులలో విజయవాడ నగరపాలక సంస్థ వారు చేసిన ఏర్పాట్లలో ఎటువంటి లోటు లేకుండా చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. అధికారులందరూ అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా తాత్కాలిక మరుగుదొడ్లను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా నిర్వహిస్తూ, త్రాగునీరు అందించడంలో ఎటువంటి లోపం లేకుండా క్యూలైన్ల వద్దనే అందిస్తూ ఉండాలని అధికారులను ఆదేశించారు. తదుపరి వైయస్ఆర్ జక్కంపూడి కాలనీ లో పర్యటించే క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. వాళ్ల సమస్యలను త్వరగా పరిష్కరించేటట్టు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.