తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
విజయ దశమి పండుగ సందర్భంగా జిల్లాలోని ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, జెసి శుభం బన్సల్, డిఆర్ఓ పెంచల కిషోర్. విజయ దశమి పండుగ అనేది భక్తి శ్రద్దలతో ప్రజలు జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండుగ అని, నవరాత్రి పండుగ సందర్భంగా, భక్తులు దుర్గాదేవి యొక్క తొమ్మిది రూపాలను ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారనీ, ఇది ధర్మం యొక్క ఆధిపత్యాన్ని మరియు చెడుపై మంచి విజయాన్ని సూచిస్తుందనీ, విజయ దశమి పండుగ సందర్భంగా ఆ దుర్గా దేవి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో సిరిసంపదలతో తుల తూగాలని ఆకాంక్షిస్తున్నామని వారు తెలిపారు.
Prajavartha Online Telugu News