నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త :
రక్తదానం చేసి ఇతరుల ప్రాణాలను కాపాడాలని ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు . శుక్రవారం స్థానిక రజక బజార్ లో అనింధ్య ఉత్సవ కమిటీ సహకారంతో దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన యువతకు పండ్లు, జ్యూస్, సర్టిఫికెట్లును ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రక్తదానం శిబిరాలను ఏర్పాటు చేయడం వలన బ్లడ్ బ్యాంకుల్లో రక్త నిల్వలు ఉండేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. రక్తదానం చేయడం వలన ఎలాంటి ఆరోగ్య సమస్యలు కూడ రావాని చెప్పారు. రక్త దానం చేసేందుకు స్వచ్ఛందగా రావడం సంతోషకరమని చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువగా చేయాల్సిన అవసరం ఉందన్నారు. గర్భిణులకు, బాలింతలకు, రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి రక్త చాలా అవసరం ఉంటుందని చెప్పారు. అలాంటి వారికి అప్పన్న హస్తం ఇచ్చేందుకు దోహదపడుతాయాని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నేతలు పాల్గొన్నారు.
Tags nandigama
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …