Breaking News

దుర్గతులను పారదోలు దుర్గమ్మ

-తొమ్మిదో రోజు శరన్నవరాత్రి మహోత్సవాలు
-అనసాగరం లో ఘనంగా దేవీశరన్నవరాత్రులు – అన్నసమారాధన
-కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త :
దుష్టుడైన మహిషాసరుడిని అంతమొందించిన భీకర శక్తి స్వరూపిణి మహిషాసుర మర్థిని రూపంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఎనిమిది భుజములు.. అష్ట ఆయుధాలు… సింహవాహినిగా.. రౌద్ర రూపంలో వున్న అమ్మవారిని దర్శించుకుంటే.. శత్రు భయం వుండదని భక్తుల విశ్వాసం. కాగా ఎన్టీఆర్ జిల్లా నందిగామ శివారు అనాసాగరం లో దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా కూటమి నేతలతో కలిసి ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అమ్మవారిని దర్శించుకున్నారు. వేదపండితులు వేద ఆశీర్వచనాలు అందజేశారు. అమ్మవారి పూజా కార్యక్రమాల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం భక్తులకు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నేతలతో కలిసి అన్నదానం చేపట్టారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *