గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని దుర్గం చెరువు సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ , హైదరాబాదు మెట్రో వాటర్ ప్రాజెక్ట్ మరియు గార్బెజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్లను గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ బృందం శుక్రువారం పరిశీలించింది. ఒడిశా మరియు తెలంగాణ రాష్ట్రాల్లోని మున్సిపల్ కార్పొరేషన్లలో అమలు చేస్తున్న కార్యక్రమాల స్టడీ టూర్ లో భాగంగా శుక్రువారం జిహెచ్ఎంసిలో వివిధ ప్రాజెక్ట్ లను నగర కమిషనర్ బృందం పరిశీలించింది.
ఈ సందర్భంగా కమిషనర్ బృందానికి తొలుత దుర్గం చెరువు లోని ఎస్టిపి ప్లాంట్ వివరాలను స్థానిక అధికారులు వివరించారు. అనంతరం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ డిసాస్టర్ రెస్పాన్స్ ఫోర్సు కార్యాలయాన్ని పరిశీలించారు. సదరు ప్రాంతంలోని గార్బెజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్లను, పనితీరు ని పూర్తి స్థాయిలో పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. తొలత దుర్గం చెరువు ఎస్టిపి ని పరిశిలించి ఎస్టిపి సామర్ధ్యం వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ విధానాన్ని వివరంగా అడిగి తెలుసుకొని , వాటర్ శాంపిల్స్ ని పరిశీలించారు. గార్బెజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్లను పరిశిలించి ప్రతిరోజు చెత్త ని ఏ విధంగా తిసుకోచే తీరుని వాటి నిర్వహణ ను పరిశీలించారు. డిసాస్టర్ రెస్పాన్స్ ఫోర్సు కార్యాలయంలో ని విభాగాలను మరియు పని చేసే సిబ్బంది ఏ విధమైన సమస్యల కు ఎలా స్పందిస్తున్నారో పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ప్రాజెక్ట్ ల పరిశీలనలో భాగంగా హైదరాబాదు మెట్రో వాటర్ ప్రాజెక్ట్ ని పరిశిలించి త్రాగునీటి సరిఫర, త్రాగునీటి శుద్ధి పైప్లైన్ లను పరిశీలించారు.
Tags guntur
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …