విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మహాశక్తి ప్రతిరూపమైన దుర్గాదేవిని పూజించి ఆరాధించే విజయదశమి పండుగను భక్తి శ్రద్దలతో ప్రజలు జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండుగ అని, నవరాత్రి పండుగ సందర్భంగా, భక్తులు దుర్గాదేవి యొక్క తొమ్మిది రూపాలను ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారనీ, ఇది ధర్మం యొక్క ఆధిపత్యాన్ని మరియు చెడుపై మంచి విజయాన్ని సూచిస్తుందనీ, విజయ దశమి పండుగను ప్రజలందరూ సుఖసంతోషాలతో జరుపుకోవాలని ఏపీ స్టేట్ ఎక్స్ సర్వీస్‌మెన్ వెల్ఫేర్ ఆసోసియేషన్ అధ్యక్షులు మోటూరి శంకరరావు ఆకాంక్షించారు. దసరా పండుగ సందర్భంగా ప్రజలందరికీ ఓ ప్రకటనలో మోటూరి శంకరరావు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి, దుష్ట శక్తులపై దైవ శక్తుల విజయానికి ప్రతీకగా జరుపుకునే పండుగ విజయదశమి అని పేర్కొన్నారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణతో ఆ ఆదిపరాశక్తి మనకు సదా స్ఫూర్తినిస్తుందన్నారు. దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భక్తులు చేసిన పూజలు లోక కళ్యాణానికి, సుఖ శాంతులకు ఆలవాలం అవుతాయని పేర్కొన్నారు. ఆ జగన్మాత చల్లని దీవెనలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని.. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరికీ సంపూర్ణ ఆరోగ్యం, సుఖ శాంతులు, సిరి సంపదలు చేకూరాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.
Tags vijayawada
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …