-అధిక ధరలు వసూలు చేస్తే కేసులు నమోదు చేస్తాం… డీటీసీ ఎ మోహన్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దసరా మహోత్సవాన్ని పురస్కరించుకొని కాంటాక్ట్ క్యారేజ్ బస్సులపై ప్రత్యేక తనిఖీలను నిర్వహించామని అధికదరలు వసూలుచేస్తున్న బస్సులపై కేసులు నమోదుచేసామని డీటీసీ ఎ మోహన్ తెలిపారు.
స్థానిక బందరు రోడ్డు లోని డీటీసీ కార్యాలయం నుండి శనివారంనాడు పత్రిక ప్రకటనను విడుదల చేసారు ఈ సందర్భంగా డీటీసీ మోహన్ మాట్లాడుతూ పండుగలకు దూరపు ప్రాంతాల నుండి సొంత ఊర్లకు వస్తున్న ప్రయాణికుల నుండి ఇదే అదనుగా చేసుకొని కొన్ని ప్రవేటు ట్రావెల్స్ బస్సులు అధిక చార్జీలను వసూలు చేస్తున్నారని అటువంటి వాహనాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించమన్నారు. జిల్లాలోని మోటారు వాహన తనిఖీ అధికారులతో ఆరు బృందాలుగా ఏర్పారచి పలుచోట్ల వాహన తనిఖీలను నిర్వహించమన్నారు. ఈ నెల 3వ తారీఖు నుండి 11వ తారీఖు వరకు జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు/ కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులపై నిర్వహించిన ప్రత్యేక తనిఖీలలో బస్సులలో సరైన రికార్డులు లేకపోవడం పన్నులు చెల్లించకపోవడం ప్రయాణికుల నుండి అధిక ధరలు వసూలు చెయ్యడం బస్సులలో ప్రయాణికుల వివరములు లేకపోవడం వంటివాటిపై 133 బస్సులపై కేసులు నమోదుచేసామన్నారు. ప్రత్యేక తనిఖీల ద్వారా 21,68,645/-రూపాయిలు అపరాధ రుసుము విధించామని ఆయన తెలిపారు. దీనిలో 12 బస్సులపై కేసులు నమోదు చెయ్యడమే కాకుండా బస్సులను సీజ్ కూడా చేశామని మోహన్ తెలిపారు. ప్రయాణికుల పట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తించడం అధిక ధరలు వసూలు చేయడం మానుకోవాలని ప్రవేటు ట్రావెల్స్ యజమానులను డీటీసీ చూసించారు. ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని మోహన్ తెలిపారు.