శ్రీ కోటసత్తెమ్మ అమ్మవారి దయ, కరుణ కటాక్షం రాష్ట్ర ప్రజలందరి పై ఉండాలని కోరుకున్న మంత్రి కందుల దుర్గేష్

-నిడదవోలు మండలం, తిమ్మరాజుపాలెం గ్రామం లో  వేంచేసియన్ను శ్రీ కోట సత్తెమ్మ అమ్మవారి ” దేవీ నవరాత్రులు మహోత్సవము ల ”  10 వ రోజు ” విజయ దశమి” సందర్భంగా శ్రీ అమ్మవారిని దర్శించుకున్న ..
-మంత్రి కందుల దుర్గేష్

నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త :
దసరా దేవీ నవరాత్రుల్లో భాగంగా శనివారం నిడదవోలు మండలం, తిమ్మరాజుపాలెం గ్రామం లో  వేంచేసియన్ను శ్రీ కోట సత్తెమ్మ అమ్మవారిని దర్శించుకొని రాష్ట్ర ప్రజలు ఆరోగ్యవంతంగా, సుఖసంతోషాలతో, అష్టైశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అమ్మవారిని వేడుకోవడం జరిగిందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక , సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. దేవీ నవరాత్రుల్లో 10 వ రోజు శనివారం ” విజయ దశమి” సందర్భంగా శ్రీ అమ్మవారిని దర్శించుకుని  ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు వేదమంత్రాలతో స్వాగతం పలికి, ప్రత్యేక పూజలు నిర్వహించి , ఆశీర్వచనం అందజేశారు. కమిటీ సభ్యులు అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ జగన్మాత శ్రీశ్రీశ్రీ కోట సత్తేమ్మ అమ్మవారి దయ కరుణ కటాక్ష వీక్షణాలు రాష్ట్ర ప్రజలందరి పై ప్రసరించి అందరి జీవితాలు బాగుపడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *