గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఇళ్ల స్థలాల లేఔట్ లలో మౌలిక సదుపాయాలను వెంటనే ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ అధికారులను ఆదేశించారు. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని లబ్దిదారులకు కేటాయించిన గన్నవరం మండలం వెదురుపావులూరులోని ఇళ్ల లేఔట్ ను శుక్రవారం అధికారులతో కలిసి సబ్ కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ మాట్లాడుతూ కొండపావులూరు లో 187 ఎకరాలు, సూరంపల్లి లో 80 ఎకరాలు, వెదురుపావులూరు లో 184. 5 ఎకరాలు విస్తీర్ణంలో లేఔట్ లు ఉన్నాయని,లబ్ధిదారులు ఇల్లు నిర్మించుకునేందుకు అనువుగా లేఔట్ లు ఉండాలన్నారు. ఆ లేఔట్ లలోకి ఇంటి నిర్మాణ సామాగ్రి తీసుకువెళ్లేందుకు వీలుగా రోడ్లు ఉండేలా చూడాలన్నారు, ఇళ్ల నిర్మాణ సమయంలో క్యూరింగ్ నిమిత్తం నీటి సదుపాయం ఉండేలా చూడాలన్నారు. సంబంధిత కాంట్రాక్టర్లు 24 గంటలూ పనిచేసి వెంటనే మౌలిక సదుపాయాలను కల్పించే విధంగా సంబంధిత తహసీల్దారు, ఎంపిడిఓ లు చర్యలు తీసుకోవాలన్నారు. ఇళ్ల నిర్మాణంలో లబ్దిదారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు చూడాలన్నారు. లబ్దిదారులకు ఇళ్ల నిర్మాణానికి ఇసుక కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని, అవసరమైతే ఆయా లేఔట్ ల వద్ద ఇసుక డంప్ చేయాలన్నారు. ఇసుకతో పాటు అవసరమైన ఐరన్, సిమెంట్ సబ్సిడీ ధరలకే లబ్దిదారులకు అందేలా చూడాలన్నారు. ఇళ్ల నిర్మాణంలో లబ్దిదారులకు ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ అధికారులను ఆదేశించారు. అనంతరం గన్నవరం మండలం సూరంపల్లి, వెదురుపావులూరు లలో లేఔట్ లను అధికారులతో కలిసి సబ్ కలెక్టర్ పరిశీలించారు. సబ్ కలెక్టర్ వెంట గన్నవరం తహసీల్దార్, ఎంపిడిఓ, ఇతర రెవిన్యూ, హౌసింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
Tags gannavaram
Check Also
సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి
-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …