Breaking News

గొలగాని రవి కృష్ణ ఆధ్వర్యంలో విజయవాడ కోమల‌ విలాస్ సెంటర్లో ఆనందయ్య కరోనా మందు పంపిణీ… 


విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రవాసాంధ్రుడు గొలగాని రవి కృష్ణ వారి  గొలగాని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కోమల‌ విలాస్ సెంటర్ వద్ద గల సమీప‌ డివిజన్లలో 45 వయస్సు పైబడిన 1600 మందికి, కృష్ణ పట్టణం బొనిగి ఆనందయ్య యాదవ్ గారి కరోనా మందు పంపిణీ జరిగింది. అడ్దూరి శ్రీ రామ్, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, విజయనగరం జిల్లా ఇంచార్జ్, భోగవల్లి శ్రీధర్, బి.జె.పి. కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి, గర్రె బాబ్జీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్నీ స్థానిక శ్రీ నగరాల సీతా రామ స్వామి మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం కమిటీ అధ్యక్షులు లింగిపిల్లి అప్పారావు ఆత్మీయ అహ్వనం మేరకు  శ్రీ నగరాల సీతా రామ స్వామి కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా పాల్గొన్న  బిజెపి‌‌ నాయకులు విజయవాడ పార్లమెంటు జిల్లా అధ్యక్షులు బబ్బూరి శ్రీ రామ్, ఓ.బి.సి. మెర్చా రాష్ట్ర అధ్యక్షులు బిట్రా శివ వెంకట నారాయణ,  మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు షేక్ బాజీ, ఓ.బి.సి. మెర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసం ఉమా మహెశ్వరరాజు, ఓ.బి.సి.మెర్చా జిల్లా అధ్యక్షులు బలివాడ శివకుమార్ పట్నాయక్, శ్రీ నగరాల సీతా రామ స్వామి మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం కమిటీ అధ్యక్షులు లింగిపిల్లి అప్పారావు, పిట్ల గోవిందు,పట్నాల హరిబాబు, బంకా‌ హనుమంతరావు, లింగిపిల్లి రామక్రిష్ణ, పిళ్లా శ్రీనివాస రావు, యిద్దిపిల్లి‌ శ్రీనివాస రావు, ఫణుకు రాజేశ్ స్థానిక ప్రజలకు కృష్ణపట్నం ఆనందయ్య గారి కరొనా నివారణ మందు పంపీణి చేసారు.
ఈ సంధర్భంగా షేక్ బాజీ మాట్లాడుతూ ప్రవాస భారతీయులు గొలగాని రవి కృష్ణ చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎంతో మంది నిరుపేదలకు ఉపయోగకరంగా ఉన్నాయని వారు మరిన్ని సేవా కార్యక్రమాలు గొలగాని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్వహించాలని కోరారు. అడ్దూరి శ్రీ రామ్  మాట్లాడుతూ కరోనా విపత్కర పరిస్థితుల్లో పేద బడుగు బలహీన ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన రవి కృష్ణ తాను పుట్టి పెరిగిన ప్రాంత ప్రజలకు సేవా చేయాలనే సంకల్పంతో కరోనా మొదటి దశ నుండి నేటి వరకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అందులో మాకు భాగస్వామ్యం కల్పించినదుకు వారికి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేసారు.
లింగిపిల్లి అప్పారావు మాట్లాడుతూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఆనందయ్య కరోనా నివారణ మందును కరోనా వచ్చిన వారికి, కరోనా రాని వారికి రాకుండా ప్రతి పేదవాడికి గడప గడపకు అందజేయలన్న రవి కృష్ణ సంకల్పం ఎంతో ఉన్నతమైనదని రవి కృష్ణకు ఆ దుర్గమ్మ వారి ఆశిస్సులు మెండుగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమమంలో పాల్గొన్న మిగతా వక్తలు అందరూ మాట్లాడుతూ రవి కృష్ణ తన తల్లి దండ్రుల పేరుమీద చేస్తున్న సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమన్నారు.
ఈ కార్యక్రమంలో విజయవాడ చిరంజీవి యువత సభ్యులు దుక్కా వేణు, పులిచేరి రమేశ్, తోట కోటి,  గొలగాని రవిక్రిష్ణ మిత్రులు పొట్నూరి చక్రధర్, గుడేలా ధరణి, నక్కాని రాము, ముదిలి ప్రసన్న, పైలా ఆనంద్, డొప్పా పవన్, ఒమ్మి సాయి తదితరులు పాల్గొన్నారు.

Check Also

రాష్ట్రంలో 6 గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుల ఫీజిబులిటీ స్టడీ కోసం రూ. 2.27 కోట్ల నిధులు విడుదల చేయనున్నాం : మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి

-కుప్పం, శ్రీకాకుళం, నాగార్జునసాగర్, తుని – అన్నవరం, తాడేపల్లి గూడెం, ఒంగోలులో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుల అభివృద్ధికి ప్రతిపాదనలు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *