-అక్టోబర్ 14 నుంచి 20 వరకూ షెడ్యూలు ఖరారు
-ప్రజా ప్రతినిధులు సమక్షంలో సీసీ రోడ్లు డ్రైనేజీ పనులకి శ్రీకారం
-జిల్లా వ్యాప్తంగా 938 పనులు కోసం రూ.8315 లక్షలు
-నిడదవోలు మండలం సింగవరం గ్రామంలో మంత్రి చేతుల మీదుగా సుమారు రూ.31 లక్షలతో ఆరు పనులకు శంఖుస్థాపన
-కలెక్టరు పి ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె పండుగ పంచాయతీల వారోత్సవాల సందర్భంగా జిల్లాలోని 253 గ్రామ పంచాయతీ లలో 938 పనులను రూ.8315 .19 లక్షల అంచనాతో ఉపాధి హామి పధకం పనులను చేపట్టడం జరుగుతున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అక్టోబరు 14 నుంచి 20 వ తేదీ వరకు ఏడు నియోజక వర్గాలలో స్ధానిక శాసన సభ్యులు ఆధ్వర్యంలో వారోత్సవాలు కోసం రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నట్లు ఆమె తెలియ చేశారు. నిడదవోలు మండలం సింగవరం గ్రామంలో రూ.30 లక్షలు 98 వేల తో చేపట్టనున్న ఆరు సి సి రహాదారి పనులకు శంకుస్థాపన రాష్ట్ర పర్యటక సాంసృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. వారోత్సవాలలో నియోజక వర్గాలు వారీగా ఆయా ప్రజా ప్రతినిధులు సమక్షంలో శంఖుస్థాపన ద్వారా చేపట్టనున్న పనుల వివరాలు…
అనపర్తి నియోజకవర్గం పరిధిలో 195 పనులు రూ.1236.57 లక్షలు , కొవ్వూరు 44 పనులు రూ.364 లక్షలు , రాజమండ్రీ రూరల్ 251 పనులు రూ.1771 లక్షలు , జగ్గంపేట (గోకవరం మండలం) 59 పనులు రూ.1143.89 లక్షలు , గోపాలపురం 81 పనులు రూ.1026.70 లక్షలు , నిడదవోలు 211 పనులు రూ.1238.33 లక్షలు , రాజానగరం 97 పనులు రూ.1534.70 లక్షలు.