Breaking News

డాక్టర్లు సేవాభావం కలిగి ఉండాలి

-పేదలకి సైతం ఆధునిక వైద్యసేవలు అందించాలి
-చిరంజీవి హాస్పిటల్స్ ప్రారంభోత్సవంలో పర్యాటక మరియు సాంస్కృతిక శాఖా మాత్యులు కందుల దుర్గేష్ వెల్లడి.
-డాక్టర్లు ప్రాణదాతలతో సమానం… రోగిని అత్యంత ప్రేమతో ఆదరించాలి…

రాజమండ్రి, నేటి పత్రిక ప్రజావార్త :
అందరికి ఆధునిక వైద్య సేవలు సామాన్యమైన ఫీజులతో అందించాలని చిరంజీవి హాస్పిటల్స్ ప్రారంభోత్సవంలో పర్యాటక మరియు సాంస్కృతిక శాఖా మాత్యులు కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. కందుల దుర్గేష్ ఆదివారం నాడు దానవాయిపేట లోని, చిన్న ఆంజనేయ స్వామి గుడి ఎదురుగ ఏర్పాటు చేసిన చిరంజీవి హాస్పిటల్స్ (వాస్కులర్ మరియు మల్టీస్పెషలిటీ) ను ప్రారంభించిన అనంతరం పర్యాటక మరియు సాంస్కృతిక శాఖా మాత్యులు కందుల దుర్గేష్ విలేకర్లతో మాట్లాడుతూ నేడు వైద్యం ఎంతో ఖరీదైనదని, పేదలకి సైతం సామాన్య ఫీజులతో ఆధునిక వైద్యసేవలు అందించాలని, డాక్టర్లు ప్రాణదాతలతో సమానమని, రోగిని ప్రేమతో ఆదరించాలని పిలుపునిచ్చారు. నేడు రాజమండ్రి అన్ని రంగాలలో అభివృద్ధి చెందిందని, ప్రపంచ పాఠం లోనే రాజమండ్రి కు ఒక ప్రత్యేక స్థానం ఉందని, విద్య, వైజ్ఞానిక, టెక్నాలజీ మరియు వైద్య రంగాలలో విశేషంగా పురోగమిస్తుందని ఈ సందర్బంగా చిరంజీవి హాస్పిటల్స్ డాక్టర్లను ప్రశంసించారు.

– వాస్కులర్ వైద్యంలో దేశంలోనే తమ హాస్పిటల్ ఎంతో విశేషంగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుందని పర్యాటక మరియు సాంస్కృతిక శాఖా మాత్యులు కందుల దుర్గేష్ పిలుపు మేరకు తమ వంతు పేదలకు సైతం ఆధునిక వైద్యసేవలు అందిస్తామని హాస్పిటల్ ఛైర్మన్, ప్రఖ్యాత వాస్కులర్ సర్జన్ డా. కె. సంజీవ రావు తెలిపారు. తమ హాస్పిటల్ నందు అన్ని రకాల అత్యాధునిక వైద్య సౌకర్యాలు, లేటెస్ట్ పరికరాలు, అంతర్జాతీయ క్యాత్ ల్యాబ్ ను ప్రవేశపెట్టామని, వాస్కులర్ లో అత్యాధునిక వైద్య చికిత్సలు అన్నిటికి తమ వద్ద వైద్య సేవలు లభిస్తాయని, విదేశాలలో లభ్యమయ్యే లేజర్ చికిత్సలు తమ వద్ద అందుబాటులో లభిస్తాయని తెలిపారు.

– చిరంజీవి హాస్పిటల్ నందు పూర్తి స్థాయి వైద్యసేవలు లభించటమే కాకుండా విశేష అనుభవం గడించిన నిపుణులచే జనరల్ మెడిసిన్, గైనకాలజి, ఆర్థోపెడిక్, జాయింట్ రిప్లేసెమెంట్స్ మరియు స్కిన్ మరియు కాస్మొటిక్ వైద్య సేవలు లభిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కిన్ స్పెషలిస్ట్ డా. శిల్ప పొన్నాడ, ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు డా. కె. వంశి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రారంభ కార్యక్రమంలో రాజమండ్రి సిటీ శాసన సభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ మరియు రాజమండ్రి జాయింట్ కమీషనర్ డా. రమేష్ కిషోర్ తో పాటు నగర వ్యాపారవేత్తలు, ప్రముఖులు పాల్గొని డాక్టర్లకు అభినందనలు తెలిపారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *