విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉపాధ్యాయ అర్హత పరీక్షలలో భాగంగా పదవ రోజు అనగా 14/10/2024 తేదీన సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు విభాగంలో ఉదయం జనరల్ అభ్యర్థులకు, మధ్యాహ్నం పేపర్ 2 ఏ మాథ్స్ & సైన్స్ అభ్యర్థులకు ఉపాధ్యాయ అర్హత పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలలో మొత్తం 21203 మందికి గాను 17937 మంది అభ్యర్థులు అనగా 84.59 శాతం మంది హాజరయ్యారు. ఉదయం 24 సెంటర్లలో జరిగిన సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల అర్హత పరీక్షకు 5460 మందికి గాను 4830 మంది అనగా 88.46 శాతం మంది హాజరయ్యారు. అదేవిధంగా మధ్యాహ్నం 61 సెంటర్లలో పేపర్ 2 ఏ.మాథ్స్ & సైన్స్ అభ్యర్థుల ఉపాధ్యాయ అర్హత పరీక్షలకు 15743 మందికి గాను13107 మంది అనగా 83.29 శాతం మంది హాజరయ్యారు. పదవ రోజు జరిగిన ఉపాధ్యాయ అర్హత పరీక్షలు ప్రశాంతంగా ముగిసాయి. సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లు మరియు ప్రాధమిక కీ 15-10-2024 నుండి వెబ్సైటులో అందుబాటులో ఉంటాయి . ప్రాధమిక కీ పై అభ్యర్థుల నుండి అభ్యంతరాలను 18-10-2024 వరకు టెట్ వెబ్సైటు (https://aptet.apcfss.in/ ) ద్వారా మాత్రమే స్వీకరిస్తారని ఏపీ టెట్ కన్వీనర్ శ్రీ ఎం.వి. కృష్ణారెడ్డి గారు ఒక ప్రకటనలో తెలియజేసారు .
Tags vijayawada
Check Also
అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం
-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …
Prajavartha Online Telugu News