Breaking News

7, 10 తరగతులకు ఎడ్యుకేషనల్ ఎపిఫని ప్రతిభా పరీక్ష / EEMT – 2025 నోటిఫికేషన్ విడుదల

-పాఠశాల విద్య డైరెక్టర్ విజయ రామరాజు IAS.

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 26 జిల్లాలలోని ప్రభుత్వ పాఠశాలలలో 2024-2025 విద్యాసంవత్సరం లో 7వ & 10 వ తరగతి చదువుతున్న ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి, రాష్ట్ర & జిల్లా స్థాయిలలో రూ. 9,00,000 నగదు బహుమతులు అందజేయడం కొరకు ఎడ్యుకేషనల్ ఎపిఫని సంస్థ నిర్వహించబోయే ప్రతిభా పరీక్ష నోటిఫికేషన్ ను సోమవారం నాడు మంగళగిరిలోని పాఠశాల విద్య రాష్ట్ర కార్యాలయం నందు పాఠశాల విద్య డైరెక్టర్ విజయ రామరాజు IAS., విడుదల చేసారు. ఎడ్యుకేషనల్ ఎపిఫని సంస్థ అధ్యక్షులు డా. తవనం వెంకట రావు మాట్లాడుతూ 12 సంవత్సరాల క్రితం పాఠశాల స్థాయిలో మొదలు పెట్టిన ప్రతిభా పరీక్ష, నేడు రాష్ట్ర స్థాయిలో ఆన్లైన్ లో నిర్వహించే స్థాయికి ఎదగడం సంతృప్తిగా ఉంది అని పేర్కొన్నారు. ఈ ప్రతిభా పరీక్ష ద్వారా ప్రభుత్వ పాఠశాలలలో చదువుతున్న విద్యార్థుల ప్రతిభా పాటవాలు వెలికి తీయవచ్చునన్నారు. కోడ్ తంత్ర సాంకేతికత సహాయంతో ఈ పరీక్ష నిర్వహిస్తున్నారని తెలియజేసారు. 7& 10 వ తరగతి విద్యార్థులు అందరు ఈ అవకాశాన్ని వినియోగించుకునేలా అందరూ సహకరించాలని కోరారు .ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని 26 జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలలో చదువుతున్న 10 వ & 7 వ తరగతి విద్యార్థులు మాత్రమే అర్హులు అని పేర్కొన్నారు. ప్రశ్నాపత్రం తెలుగు & ఆంగ్లం మాధ్యమాలలో ఉంటుంది.పరీక్ష 2 దశలలో జరుగుతుందని, ప్రిలిమ్స్ 29.12.2024 నాడు జరుగుతుందని,ప్రిలిమ్స్ పరీక్ష నందు 40 శాతం పైబడి మార్కులు పొంది & ఆన్లైన్ పరీక్ష నియమ నిబంధనలు సక్రమంగా పాటించిన వారు మాత్రమే తరువాతి దశ(మెయిన్స్ )కు అర్హత పొందుతారని తెలిపారు .ఇక మెయిన్స్ పరీక్ష 19.01.2025నాడు జరుగుతుందని, ఇందులో 50 శాతం పైబడి మార్కులు పొంది & ఆన్లైన్ పరీక్ష నియమ నిబంధనలు సక్రమంగా పాటించిన వారు మాత్రమే బహుమతుల ఎంపిక కొరకు పరిగణనలోనికి తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అకడమిక్ క్యాలెండరు 2024- 2025 ను అనుసరించి డిసెంబర్ 2024 వరకు గల గణితం, సైన్స్ , సోషల్ సిలబస్ పై 80 శాతం ప్రశ్నలు, జికె&ఐ క్యూ లపై 20 శాతం ప్రశ్నలు ఉంటాయని తెలియజేసారు
ప్రిలిమ్స్ & మెయిన్స్ పరీక్షలు 60 ప్రశ్నలతో 100 మార్కులుకు నిర్వహించబడును. పరీక్ష నిడివి 60 నిమిషాలు ఉంటుంది. విద్యార్థులు తమ ఇంటి వద్దనుండే మొబైల్ లో ఈ పరీక్ష రాయవచ్చు. ఆసక్తి గల విద్యార్థులు 15.10.2024 నుండి 14.11.2024 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చును. రిజిస్ట్రేషన్ కోసం ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని, ఉచితంగానే https://educationalepiphany.org/eemt2025/registrations2025.php లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
రాష్ట్ర స్థాయిలో 10 వ తరగతిలో
ప్రథమ స్థానం రూ. 30000.00 ద్వితీయ స్థానం రూ. 25000.00 తృతీయ స్థానం రూ. 20000.00,
7 వ తరగతి
ప్రధమ స్థానం రూ. 20000.00,ద్వితీయ స్థానం రు. 15000.00, తృతీయ స్థానం రూ. 10000.00
అందజేస్తారని తెలిపారు. జిల్లా స్థాయి 10 వ తరగతి ప్రథమ స్థానం – రు. 8000, ద్వితీయ స్థానం – రు. 6000 తృతీయ స్థానం – రూ. 4000 అందజేస్తారు.
అదేవిధంగా జిల్లా స్థాయి 7 వ తరగతి ప్రథమ స్థానం – రు. 5000 ద్వితీయ స్థానం – రూ. 4000,తృతీయ స్థానం – రూ. 3000 అందజేస్తారని తెలిపారు.
మండల స్థాయిలలో 10 & 7 వ తరగతులలో ప్రథమ, ద్వితీయ & తృతీయ స్థానం పొందిన వారికి మెడల్,ప్రశంసా పత్రం వారి పాఠశాలల కు అందజేస్తారు.
EEMT 2025 కు సంబంధించిన తాజా సమాచారం మరియు అప్డేట్స్ కొరకు EEMT – 2025 OFFICIAL అనే వాట్సప్ ఛానల్ ను ఫాలో కావాలని సూచించారు.
వాట్సాప్ ఛానల్ లింక్ https://whatsapp.com/channel/0029VaIQK8g2Jl8BPM5KX928
EEMT 2025 కు సంబంధించిన మరింత సమాచారం & సందేహాల నివృత్తి కొరకు 9573139996/ 9666747996/ 6303293502 నంబర్ లలో సంప్రదించాలని మరియు www.educationalepiphany.org వెబ్సైటు సందర్శించాలని కోరారు.ఈ పరీక్ష కు ఎడ్యుకేషనల్ ఎపిఫని సంస్థ ప్రతినిధి పుట్టం రాజు శ్రీరామచంద్ర మూర్తి కన్వీనర్ గాను, దూదేకుల నబి రాష్ట్ర సమన్వయకర్త గా వ్యవహరిస్తారు. ఈ కార్యక్రమంలో ఎడ్యుకేషనల్ ఎపిఫని వ్యవస్థాపక అధ్యక్షులు డా. తవనం వెంకటరావు, గౌరవ సలహాదారు దిడ్ల స్వామి, సభ్యులు సురేష్ ,శ్రీనివాసరావు, అశోక్ సుబ్రహ్మణ్యం , కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *