గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగర పాలక సంస్థలో పార్క్ విభాగంలో విధులు నిర్వహించే కార్మికులు తగిన రక్షణ పరికరాలు ధరించి విధులు నిర్వహించాలని, అందుకు తగిన రక్షణ పరికరాలను అందిస్తామని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. సోమవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో జిఎంసి పార్క్ విభాగాల్లో విధులు నిర్వహించే కార్మికులకు రక్షణ పరికరాలను అందించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగర పాలక సంస్థలోని వివిధ విభాగాల కార్మికులు ప్రజారోగ్యం, మౌలిక వసతుల కోసం ఎంతో కష్టపడుతున్నారని అటువంటి కార్మికులకు నగర పాలక సంస్థ అండగా నిలుస్తుందన్నారు. కార్మికుల భద్రతకు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నామన్నారు. పార్క్ విభాగంలోని కార్మికులకు విధుల్లో వినియోగించే హ్యాండ్ గ్లౌజులు, లాంగ్ బూట్లు, రెయిన్ కోట్లు, హెల్మెట్లు వంటి రక్షణ పరికరాలను అందిస్తున్నామని తెలిపారు. సమావేశంలో అదనపు కమిషనర్ సిహెచ్.ఓబులేసు, డిప్యూటీ కమిషనర్లు సిహెచ్.శ్రీనివాస్, డి.శ్రీనివాసరావు, సిటి ప్లానర్ రాంబాబు, ఎస్.ఈ. నాగమల్లేశ్వరరావు, ఎంహెచ్ఓ డాక్టర్ రవి, ఏడిహెచ్ రామారావు, తదితరులు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …