గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజి వ్యవస్థ ఉన్న ప్రాంతాల్లో ఓవర్ ఫ్లో వలన ప్రజలకు ఇబ్బందులు లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఇంజినీరింగి అధికారులను ఆదేశించారు. సోమవారం కమిషనర్ గారు ఆనందపేట, గోరంట్ల ప్రాంతాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజి లైన్లు, పారిశుధ్య పనులను ఇంజినీరింగ్, ప్రజారోగ్య అధికారులతో కలిసి పరిశీలించి తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ ఆనందపేటలో అండర్ గ్రౌండ్ డ్రైనేజి ఓవర్ ఫ్లో వలన మురుగు నిలిచిన ప్రాంతాలను పరిశీలించి, తక్షణం నీటిని బెయిల్ అవుట్ చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రత్యేకంగా సక్కర్ వాహనాలను, యుజిడి లైన్లు శుభ్రం చేసే వాహనాలను తెప్పించి సంబందిత ప్రాంతాల్లో యుజిడి లైన్లను వెంటనే క్లియర్ చేయాలన్నారు. యుజిడి లైన్ల మీద ఉండే మ్యాన్ హోల్స్ ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటే ఓవర్ ఫ్లో సమస్య రాదని, ఏఈలు మరింత శ్రద్ద చూపాలన్నారు. యుజిడి లైన్లు లీకులు ఏర్పడకుండా శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవడానికి ప్రతిపాదనలు సిద్దం చేయాలని ఆదేశించారు. అనంతరం ఇన్నర్ రింగ్ రోడ్ లోని పలు ప్రాంతాల్లో పారిశుధ్యం, డ్రైన్ల పై స్థానికులు ఫిర్యాదు మేరకు జిఎంసి అధికారులతో కలిసి పరిశీలించి, శివారు ప్రాంతాల్లో మురుగు నిల్వకుండా కచ్చా కాల్వలు ఏర్పాటు చేయాలన్నారు. బహుళ అంతస్తు నిర్మాణాలు చేసేవారు అవుట్ ఫాల్ డ్రైన్ లోకి కనెక్షన్ ఇచ్చేలా పట్టణ ప్రణాళిక అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
పర్యటనలో డిప్యూటీ కమిషనర్ టి.వెంకట కృష్ణయ్య, ఈఈలు కోటేశ్వరరావు, శ్రీనివాస్, ఏసిపి ఫజులూర్ రెహ్మాన్, డిఈఈ సతీష్, ఎంహెచ్ఓ రాంబాబు, ఆర్.ఓ. రవి కిరణ్ రెడ్డి, కార్పొరేటర్ ఆబీద్ బాష, తదితరులు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …