Breaking News

మానవ అక్రమ రవాణా నిర్మూలన – నిఘానేత్రంతోనే సాధ్యం పోస్టర్లు విడుదల

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతిలోని ఎస్పీ కార్యాలయం నందు ఈరోజు సుబ్బరాయుడు, (ఎస్పీ- తిరుపతి జిల్లా ) అంతర్జాతీయంగా అక్టోబర్ 19వ తేదీన మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా భారతదేశ వ్యాప్తంగా 110 ప్రాంతాల్లో ఒకేరోజు ఒకే సమయంలో వాక్ ఫర్ ఫ్రీడమ్ కోసం సైలెంట్ నడక ర్యాలీ ఆస్ట్రేలియా 21 సంస్థ ద మూమెంట్ ఇండియా మరియు గ్రామ జ్యోతి సొసైటీ సంయుక్త సౌజన్యంతో పరివర్తన స్వచ్ఛంద సేవా సంస్థ తిరుపతి వారి ఆధ్వర్యంలో ” మానవ అక్రమ రవాణా నిర్మూలన అక్టోబర్ 19 వ తారీకున 2024 సంవత్సరానికి గాను గవర్నమెంట్ ఐటిఐ కాలేజ్ నుండి పద్మావతి పురం సర్కిల్ వరకు సైలెంట్ నడక ర్యాలీ( వాక్ ఫర్ ఫ్రీడమ్ ) కొరకు ముఖ్య అతిథి తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు చేతుల మీదుగా పోస్టర్లు మరియు టీ షర్ట్లు ఆవిష్కరింప చేయడం జరిగిందని పరివర్తన సేవా సంస్థ అధ్యక్షులు మరియు తిరుపతి జిల్లా మానవ అక్రమ రవాణా నిర్మూలన కమిటీ కన్వీనర్ పి అమరనాథ్ తెలియజేశారు. పోస్టర్లు ఆవిష్కరణ అనంతరం ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ నేటికీ మన సమాజంలో అక్కడక్కడ కొన్ని ప్రాంతాలలో మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్న వ్యక్తులు, గ్రూపులు ఉన్న చోట ముఖ్యంగా బాలలు, కిషోర్ బాలికలు, యువతి, మహిళలు మరియు వృద్ధులు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఆపరచితమైన వ్యక్తుల పట్ల మరియు మోసపూరితమైన మాటల చెప్పే వ్యక్తుల పట్ల మరింత అవగాహన కలిగి ఉండి అలాంటి వారి యొక్క సమాచారాన్ని పోలీస్ టోల్ ఫ్రీ నెంబర్ 100కు గాని, చైల్డ్ లైన్ నెంబర్ 1098 కు సమాచారం అందించి తక్షణమే సహాయం పొందవచ్చని ఎస్పీ తెలియజేశారు. అలాగే ఉపాధి, ఉద్యోగం, లైంగిక గృహనిర్బంధంలో, వెట్టి చాకిరి, బిచ్చాటన, బలవంతపు వివాహం, పీడిత మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రజల నిరంతరం నిఘానేత్రంతో పోలీస్ అధికారులకు సమాచారం ఇచ్చి రక్షణ సహాయం పొందాలని ఆయన సూచించనారు. అలాగే ఆస్ట్రేలియా 21 ద మూమెంట్ ఆఫ్ ఇండియా క్యూఆర్ కోడ్ కు స్కాన్ చేసుకొని సహాయం పొందవచ్చని సూచించారు. ఈ కార్యక్రమానికి అక్టోబర్ 19 తేదీ ముఖ్యఅతిథిగా తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు హాజరవడానికి అనుమతి ఇచ్చి ఉన్నారు. ఈ కార్యక్రమంలో పరివర్తన స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు మరియు తిరుపతి జిల్లా మానవ అక్రమ రవాణా నిర్మూలన కమిటీ కన్వీనర్ పి అమరనాథ్, హెల్పింగ్ హాండ్స్ సొసైటీ కార్యదర్శి ఎన్ దొరస్వామి కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ జిల్లా మహిళా అధ్యక్షురాలు గిరిజ, శ్రద్ధ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షురాలు విజయలక్ష్మి, పరివర్తన సేవా సంస్థ టీమ్ మెంబర్స్ కే శేషయ్య, పి అనిల్, ఏం మిథున్ చక్రవర్తి లు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *