Breaking News

వర్షాలతో ప్రజలకు ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేశాం

-అందుబాటులో 30 మంది డిజాస్టర్ మేనేజ్మెంట్ సిబ్బంది
-అంటురోగాలు రాకుండా అన్ని చర్యలు చేపట్టాం
-క్లోరినేషన్, నీటి సాంద్రత పరీక్షలు చేస్తున్నాం.
-కమిషనర్ ఎన్.మౌర్య

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
తుఫాన్ ప్రభావంతో నగర ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని రకాల చర్యలు చేపట్టామని, అందరూ అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉన్నారని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో కురుస్తున్న వర్షాలకు ప్రత్యామ్నాయంగా చేసిన ఏర్పాట్లు గురించి మంగళవారం కమిషనర్ ఎన్.మౌర్య విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ తుఫాన్ ప్రభావంతో రానున్న మూడు రోజులు తీవ్ర వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈ వర్షాలకు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. మురుగునీటి కాలువలు పొంగి పొర్లకుండా ఎక్కడిక్కడ చెత్త తొలగిస్తున్నామని అన్నారు. డ్రైనేజీ, కాలువలు పొంగినా, వర్షాల వలన ఎటువంటి ఇబ్బందులు ఉన్న హెల్ప్ లైన్ 0877 2256766 కి పిర్యాదు చేయచ్చునని అన్నారు. వర్షపు నీరు ఎక్కువగా నిలిచే ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టామని అన్నారు. ఎక్కడైనా కాలనీల్లో , ఇండ్లలో నీరు ఎక్కువగా చేరితే పంపింగ్ చేయడానికి మోటార్లతో సిద్ధంగా ఉన్నామని అన్నారు. మ్యాన్ హోల్స్ ఉన్న దగ్గర తగు జాగ్రత్తలు తీసుకున్నామని అన్నారు. ప్రజలకు అంటురోగాలు ప్రబలకుండా పారిశుద్ధ్య పనులు చేపట్టిన వెంటనే బ్లీచింగ్ చేస్తామని అన్నారు. త్రాగునీటి శుభ్రత విషయంలో చర్యలు చేపట్టామని, ఎప్పటికప్పుడు క్లోరినేషన్, నీటి సాంద్రత పరీక్షలు చేస్తున్నామని అన్నారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఉన్న వారు తమకు సమాచారం అందిస్తే పునరావాస కేంద్రాలకు తరలిస్తామని అన్నారు. చెట్లు పడిపోయే స్థితిలో ఉన్నా తమకు సమాచారం అందించాలని అన్నారు. కాలువలు, డ్రైనేజ్ లపై అక్రమ నిర్మాణాలు చేయడం వల్లే ఎక్కువగా నీరు రోడ్లపైకి వస్తున్నాయని అన్నారు. ఇటువంటి నిర్మాణాల తొలగింపుకు చర్యలు చేపడతామని అన్నారు. నీరు ఎక్కడైనా ఆగినా వాటిలో దోమలు లార్వా వృద్ధి చెందకుండా చేసేందుకు ఆయిల్ బాల్స్ సిద్దం చేశామని అన్నారు. దోమలు నివారణకు అన్ని వార్డుల్లో స్ప్రేయింగ్, ఫాగింగ్ చేస్తున్నామని అన్నారు. ఎటువంటి కఠిన పరిస్థితులనైనా సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజలకు సాయం అందించేందుకు 30 మంది తో కూడిన ఎన్ డి.ఆర్.ఎఫ్ సిబ్బంది అందుబాటులో ఉన్నారని తెలిపారు. నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉన్నారని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా తమకు సమాచారం ఇస్తే వెంటనే వచ్చి సాయం అందిస్తామని చెప్పారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *